AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో భగవంతుడా.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే..

చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ.. ఇప్పుడు పసిహృదయాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఆ వయస్సు.. ఈ వయస్సు అని లేకుండా.. గుండెపోటు చిన్నారులను కూడా మృత్యు ఒడిలోకి చేరుస్తుండటం .. ఆందోళన కలిగిస్తోంది..

అయ్యో భగవంతుడా.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే..
Four-year-old Girl dies of heart attack
N Narayana Rao
| Edited By: |

Updated on: Nov 19, 2024 | 2:49 PM

Share

చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. ఆ వయస్సు.. ఈ వయస్సు అనిలేకుండా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. నాలుగేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.. ఛాతీలో నొప్పి వస్తుంది.. ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా అంటూనే ఆ చిన్నారి కుప్పకూలింది.. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే.. ఆ పసిపాప కన్నుమూయడం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి ప్రహర్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన ఖమ్మం రూరల్ మండలం, ఎమ్ వెంకటాయపాలెంలో చోటుచేసుకుంది.. కళ్ల ముందు ముద్దుగా మాటలు చెబుతూ.. ఆడుతూ గెంతులేసే.. ప్రహర్షిత.. ఒక్కసారిగా కుప్పకూలింది.. ముందుగా.. ప్రహర్షిత.. ఛాతీలో నొప్పి ఉందమ్మా.. ఆసుపత్రికి తీసుకు వెళ్ళండి అంటూ.. వాళ్ల అమ్మకు చెప్పింది.. వెంటనే ఆయాస పడుతూ చిన్నారి కుప్ప కూలింది..

ఆందోళన చెందిన తల్లి తండ్రులు వెంటనే గ్రామంలో ఉన్న స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు తీసుకువెళ్ళారు.. సీపీఆర్ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.. దీంతో స్పృహ తప్పి పడిపోయిన ప్రహర్షితాను మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందింది.

ఇదంతా 15 నిముషాల వ్యవధిలోనే జరగిపోయింది.. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.. నాలుగేళ్ల ప్రహర్షిత స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది.. ఇంట్లో, స్కూల్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుందని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అప్పటి వరకు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారి క్షణాల్లో కుప్ప కూలి చనిపోవడంతో తల్లి తండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్న ఒక్క కూతురు ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.. కాగా.. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..