AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంట కలిసిన మానవత్వం.. మహిళా దహన సంస్కారాలు అడ్డుకున్న మాజీ సర్పంచ్!

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన మహిళా దహన సంస్కారాలను వైకుంఠధామంలో మాజీ సర్పంచ్ భాస్కర్ అడ్డుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చివరికి గ్రామ చెరువు కట్టపై దహన సంస్కారాలు నిర్వహించారు కుటుంబీకులు. దీంతో గ్రామంలో ఎవరికి కటింగ్, సేవింగ్ చేయకూడదని సదరు మహిళా కులస్తులు తీర్మానం చేసుకున్నారు.

మంట కలిసిన మానవత్వం.. మహిళా దహన సంస్కారాలు అడ్డుకున్న మాజీ సర్పంచ్!
Prevented The Cremation
P Shivteja
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 22, 2024 | 7:18 PM

Share

మాయం అయి పోతున్నడమ్మా.. మనిషి అన్నవాడు..! మచ్చుకు అయిన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, అనే ఈ పాట ప్రస్తుతం కాలానికి సరిగ్గా సరిపోతుంది. కొన్ని కొన్ని ఘటనలు చూస్తే, అది నిజమే అనిపిస్తుంది. కొంతమంది చేసే పనులకు మనం ఊర్లల్లో బతుకుతున్నమా..? అడవిలో బతుకతున్నామా అనే అనుమానం రాక మానదు..! ఒక మనిషి బతికి ఉన్నప్పుడే కాదు, మనిషి చనిపోయిన కూడా అతనికి విలువ ఇవ్వడం లేదు చాలా మంది. ఓ మహిళ చనిపోతే ఆమె దహన సంస్కారాలను సైతం అడ్డుకున్నారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ అనే వృద్ధురాలు గత మూడు రోజుల క్రితం మృతిచెందింది. మృతురాలికి దహన సంస్కారాలు నిర్వహించడానికి, వాళ్ల కుటుంబీకులు గ్రామంలోని వైకుంఠధామం వద్దకు వెళ్ళారు. అయితే ఇక్కడ వారి కులస్తులు దహన సంస్కారాలు చేయకూడదని గ్రామ మాజీ సర్పంచ్ అడ్డుకున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. గ్రామానికి పెద్ద దిక్కుగా ఉండే మాజీ సర్పంచ్ ఇలా చేస్తే, చేసేదీ ఏమి లేక మృతురాలి కుటుంబీకులు గ్రామంలోని చెరువు కట్టపై ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామంలోని మంగలి కులస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కుల పెద్దలు అందరూ కలిసి తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు గ్రామంలో ఎవరికి కటింగ్ చేయకూడదని తీర్మానం చేసుకున్నారు. దీంతో గ్రామంలో క్షౌర సేవలను నిలిపివేశారు. కాగా గ్రామంలో కట్టిన వైకుంఠధామం ఒక కులస్థుల కోసం కట్టినది అని, అందుకే వీరిని వైకుంఠధామంలోకి అనుమతి ఇవ్వలేదని సదరు మాజీ సర్పంచ్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మరో ఇద్దరు గ్రామస్తులు ఇరు మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరీ ఈ ఉదంతం ఎక్కడి వరకు దారి తీస్తుందో..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు