Congress: ‘కాంగ్రెస్ హామీలను ప్రజలు రాసి పెట్టుకున్నారు’.. మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారం కోసం బీఆర్ఎస్ అలివిగాని హామీలను ఇచ్చిందని.. వాటిని అమలు చేయకుంటే వెంటపడైనా నెరవేర్చేలా చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు అందించాలని.. లేని పక్షంలో తాము ప్రజల గొంతుకను వినిపిస్తామన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు అందించాలని.. లేని పక్షంలో తాము ప్రజల గొంతుకను వినిపిస్తామన్నారు. ఇక ఇప్పటి వరకూ తాము సాధించిన ప్రతీ విజయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు సాధించామని దీని వెనుక పార్టీ శ్రేణులు, కార్యకర్తల కృషి ఉందన్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లో బీఆర్ఎస్కి మంచి సింపతీ వచ్చిందన్నారు. ‘‘అయ్యో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేదా. కేసీఆర్ సీఎంగా లేరా అంటూ మెసేజ్ ల రూపంలో ఫీడ్ బ్యాక్ వస్తోందని.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారు కూడా వీడియోలు, మెసేజ్‌లలో అన్నా ఇట్ల అయిపోయిందని సింపతి వ్యక్తం చేస్తున్నారని” అని తెలిపారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ, ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తాం వంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలు రాసిపెట్టుకున్నారని.. మరోసారి గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు నేరవేర్చపోతే ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషిస్తామని తెలిపారు.
‘‘కాంగ్రెస్ హామీలు నేరవేర్చకపోతే ప్రజలు గమనిస్తారు. మా పని మేం చేసుకుంటూ పోతాం. ప్రజలు కాంగ్రెస్ పాలన గురించి ఆలోచన చేస్తారు. త్వరలోనే మళ్లీ మేం ప్రజల విశ్వాసాన్ని చోరగొంటాం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటమి స్పీడ్ బ్రేకర్ లాంటిది కార్యకర్తలు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. కొంత నిరాశ ఉన్న మాట వాస్తవమే అయినా ఓటమికి భయపడేది లేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



