Revanth Reddy: పిలుపు వెళ్లినా హాజరుకాని ప్రముఖులు, ఇండియా కూటమి నేతలు.. ఎందుకిలా..?
మన ప్రభుత్వం ఏర్పడుతోంది.. ఇది మనందరి పండగ.. రండి సెలబ్రేట్ చేసుకుందాం అంటూ యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్‌రెడ్డి. జనం సంగతేమో గాని.. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు హాజరయ్యారు? ఎవరెవరు డుమ్మా కొట్టారు.. ఆయా రాష్ట్రాలతో తెలంగాణాకు ఉన్న ఇష్యూలేంటి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఇదొక ఇంట్రస్టింగ్ టాపిక్.

మన ప్రభుత్వం ఏర్పడుతోంది.. ఇది మనందరి పండగ.. రండి సెలబ్రేట్ చేసుకుందాం అంటూ యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్‌రెడ్డి. జనం సంగతేమో గాని.. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు హాజరయ్యారు? ఎవరెవరు డుమ్మా కొట్టారు.. ఆయా రాష్ట్రాలతో తెలంగాణాకు ఉన్న ఇష్యూలేంటి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సమయంలో ఇదొక ఇంట్రస్టింగ్ టాపిక్.
స్టేడియంలో, గ్యాలరీల్లో పార్టీ కార్యకర్తల సందోహం.. వేదికపైన మహామహులంతా కొలువుదీరగా రేవంత్ టీమ్ ప్రమాణస్వీకారం చేసింది. రేవంత్‌రెడ్డి ఆహ్వానం మేరకు ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలు సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంక పట్టాభిషేకానికి విశిష్ట అతిథులుగా విచ్చేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రముఖులు కేసీఆర్, జగన్, స్టాలిన్, చంద్రబాబుకు సైతం పిలుపు వెళ్లినా.. ఎవ్వరూ అటువైపు చూడనే లేదు. ఇండియా కూటమి నేతలకు సైతం కలిసుందాం రా అని పిలుపునిచ్చినా.. వాళ్ల ఆచూకీ మచ్చుకైనా లేదు. వేరే షెడ్యూల్ కారణంగా ఇండియా కూటమి నేతలు హాజరుకాలేదని చెబుతున్నా.. కాంగ్రెస్‌తో ఉన్న విభేదాలే కారణమని తెలుస్తోంది. అశోక్‌గెహ్లాట్, కమల్‌నాథ్ లాంటి మాజీ ముఖ్యమంత్రులు సైతం రేవంత్ విష్ లిస్టులో ఉన్నా.. ఎవ్వరూ వేదిక మీద కనిపించలేదు. కొందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పి తప్పించుకున్నారు.
కర్నాటక నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉత్సవంలో స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చానంటూ డయాస్ మీద సందడి చేశారు సీఎం సిద్ధూ. కర్నాటక విక్టరీ తర్వాతే తెలంగాణలో కాంగ్రెస్‌కి ఊపు వచ్చిందని, కర్నాటక ఫార్ములాతోనే ఇప్పుడు పార్టీ పవర్లోకొచ్చిందని చెప్పుకుంటూ కాంగ్రెస్‌తో దోస్తీ పాట పాడుతోంది తెలంగాణ కాంగ్రెస్. రేపటిరోజున పాలనాపరంగా కర్నాటకతో తేల్చుకోవాల్సిన పంచాయతీల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రేవంత్ ప్రమాణ స్వీకారానికి మరో చీఫ్ గెస్ట్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌వీందర్ సింగ్. ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంటులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చునేవారని, ఆ పరిచయం వల్లనే ఇప్పుడు ముఖ్యమంత్రులుగా సుఖ్వీందర్, రేవంత్‌రెడ్డి కలిశారని తెలుస్తోంది. అటు… పార్టీతో ప్రమేయం లేకుండా ప్రొటోకాల్‌ని గౌరవిస్తూ.. మండలి ఛైర్మన్ హోదాలో ప్రమాణ స్వీకారానికి వచ్చారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఇలా.. రేవంత్ పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన అతిథులు, రాని అతిథులపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
