Hunting For Tiger : పులి జాడెక్కడ..? టైగర్ చిక్కేదెప్పుడు..? ఫారెస్ట్ అధికారులను వెంటాడుతున్న ప్రశ్నలు..
పులి ముప్పుతిప్పలు పెడుతోంది. అడవి జిల్లాలో అటవీ శాఖాధికారుల్ని ఆగం చేస్తోంది. ఆఫీసర్ల వ్యూహాలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. కంది భీమన్న అడవుల్లో ఐదు రోజులుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిష్ఫలంగా మారుతోంది.
Hunting For Tiger : పులి జాడెక్కడ..? టైగర్ చిక్కేదెప్పుడు..? ఇప్పుడీ ప్రశ్నలే ఆదివాసిల్ని వెంటాడుతున్నాయి. టైగర్ కోసం జల్లెడ పడుతున్నా రిజల్ట్ మాత్రం జీరో.. కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నా పులి మాత్రం దొరకడం లేదు. ఆపరేషన్ ఫలితాన్నివ్వడం లేదు.
పులి ముప్పుతిప్పలు పెడుతోంది. అడవి జిల్లాలో అటవీ శాఖాధికారుల్ని ఆగం చేస్తోంది. ఆఫీసర్ల వ్యూహాలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. కంది భీమన్న అడవుల్లో ఐదు రోజులుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిష్ఫలంగా మారుతోంది. ఇటీవల ఎరగా వేసిన ఆవును హతమార్చిన పెద్ద పులి.. మరో పశువును మాత్రం ముట్టడం లేదు. ఆపరేషన్ టైగర్‌ను మ్యాన్ ఈటర్ పసిగట్టిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నాలుగు డ్రోన్ల సాయంతో కందిభీమన్న అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు ఫారెస్ట్ అధికారులు. అయినా ఫలితం లేకపోవడంతో టైగర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలా వద్ద అన్న డైలామాలో అటవీ శాఖ పడిపోయింది. టైగర్ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. కందిభీమన్న అటవీ ప్రాంతం నుంచి పెద్దవాగు దాటుతూ డ్రోన్ కెమెరాలకు చిక్కింది మ్యాన్ ఈటర్.
మ్యాన్ ఈటర్ టైగర్ రెస్క్యూ ఆపరేషన్‌ను పసిగట్టి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనుషుల సంచారం, రెస్క్యూ టీం అలజడి తెలియకుండా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది.
ఆపరేషన్ సాగుతున్న ప్రాంతంలో 20కి పైగా పశువుల పేడతో సంచులను ఏర్పాటు చేసింది. ట్రాక్ కెమెరాలను 160కి పెంచింది. కందిభీమన్న అటవీ ప్రాంతంతో పాటు 30 కిలోమీటర్ల మేర పెద్ద వాగు సరిహద్దు, ప్రాణహిత పరివాహక ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పటిష్ఠమైన వలల్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలోనే మరో పులి సంచారం ప్రస్తుతం కలకలం రేపుతోంది.