AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చదువు పేరుతో విదేశాల నుంచి.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..

హైదరాబాద్‌లో విదేశీ వ్యభిచార రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చిన ఓ విదేశీయుడు కెన్యా, ఉగాండా దేశాల మహిళలతో ఈ దందా నడుపుతున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు ఐదుగురు విదేశీ మహిళలను అరెస్ట్ చేశారు.

Telangana: చదువు పేరుతో విదేశాల నుంచి.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Foreign Prostitution Racket Hyderabad
Krishna S
|

Updated on: Nov 12, 2025 | 11:09 AM

Share

దేశంలో చదువుకోవడానికి స్టూడెంట్ వీసాపై వచ్చి.. ఇక్కడ వ్యభిచార రాకెట్‌ను గుట్టుగా నడుపుతున్న విదేశీ ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడితో సహా ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో ఉన్న ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు.

ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డేరియస్ 2021లోనే స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, స్థానికంగా ఒక కాలేజీలో ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఇతడు కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో వ్యభిచార దందాను నడిపిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

ఐదుగురి అరెస్ట్.. రెస్క్యూ హోమ్‌కు మహిళలు

దాడి సందర్భంగా ప్రధాన నిందితుడు డేరియస్‌తో పాటు మరో నలుగురు విదేశీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించగా, ప్రధాన నిందితుడైన డేరియస్‌ను రిమాండ్‌కు పంపారు. ఈ ముఠాకు స్థానికంగా ఎవరు సహకరిస్తున్నారు..? వీరి వెనుక ఇంకా ఎవరైనా పెద్ద నెట్‌వర్క్ ఉందా? అనే కోణంలో మియాపూర్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
హీరోయిన్‌కు బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని.. వీడియో వైరల్
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?