Telangana: ఆ రైతులకు త్వరలో గుడ్ న్యూస్.. నెల నెలా పింఛన్‌ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్..

Farmer Pension Scheme: తెలంగాణంలో అన్నదాతలకు వ్యవసాయం దండగ కాదు పండగ అనిపించేలా సిఎం కెసిఆర్ (CM KCR) చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న బడ్జెట్‌లో...

Telangana: ఆ రైతులకు త్వరలో గుడ్ న్యూస్.. నెల నెలా పింఛన్‌ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కార్..
Farmers
Follow us

|

Updated on: Jan 12, 2022 | 12:35 PM

Farmer Pension Scheme: తెలంగాణంలో అన్నదాతలకు వ్యవసాయం దండగ కాదు పండగ అనిపించేలా సిఎం కెసిఆర్ (CM KCR) చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న బడ్జెట్‌లో అన్నదాతల కోసం సరికొత్త స్కీమ్ ప్రకటించేందుకు సిఎం కెసిఆర్ రెడీ అవుతున్నారు. అన్నారు అన్నదాతకు పింఛన్‌ స్కీం ను అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలపై ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎక్సర్‌సైజ్‌ మొదలు పెట్టింది. కొండపోచమ్మసాగర్‌ ప్రారంభోత్సవం సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. త్వరలో రైతులకు గుడ్‌ న్యూస్‌ (Farmer Pension Scheme) చెప్తానని అన్నారు.

ఎప్పుడో ఇచ్చిన రైతులకు పింఛన్‌ స్కీం హామీని అమలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. వీటికి తోడు అన్నదాతల కోసం ఈ ఫించన్ స్కీం ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది

రైతుల కోసం పింఛన్‌ స్కీం కోసం విధివిధానాలు రూపొందించే పనిలో ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఫుల్ బిజీగా ఉంది . ఈ పథకానికి 47 ఏండ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులు అర్హులు. వీరికి రూ.2,016 పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నారు. వీరికంటే అన్నదాతలకు రెండేళ్ళ గరిష్ట పరిమితిని తగ్గించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు పథకం లబ్దిదారులు 67 లక్షల మంది ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది, 49 ఏళ్లు నిండిన వాళ్లు ఎంతమంది ఉన్నారనే విషయంపై పూర్తీ వివరాలను సేకరిస్తున్నట్లు టాక్. అంతేకాదు రైతుబంధు పథకం లబ్దిదారులైన రైతులలో ఎంతమందికి భూమి ఉందని విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మూడు నుంచి ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు పింఛన్‌ ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అన్ని వివరాలను పొందు పరుస్తూ ఓ సమగ్ర వేదికను అధికారులు తయారుచేస్తున్నారు. అంతేకాదు.. అన్నదాతకు ఈ పథాన్ని అమలు చేస్తే.. ఖజానా పై ఎంత భారం పడనున్నది అనే విషయంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Also Read: CM Father: బ్యాలెట్లు వాడండి..లేదంటే నా చావుకు అనుమతినివ్వండి.. రాష్ట్రపతికి సిఎం తండ్రి లేఖ..