Telangana: నిరుపేద మహిళ కలలో కనిపించి ఆలయం నిర్మించమన్న అమ్మవారు… ఆ తర్వాత

ఆమెది పేద కుటుంబం.. కానీ పెద్ద కుటుంబం. అందరూ కష్టించి పనిచేసేవాళ్లే. అయితే ఏళ్ల తరబడి చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో వారు ఓ దేవాలయం నిర్మించారు. దాని వెనుక పెద్ద రీజనే ఉంది. ఆ వివరాలు...

Telangana: నిరుపేద మహిళ కలలో కనిపించి ఆలయం నిర్మించమన్న అమ్మవారు... ఆ తర్వాత
Poor Women
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2022 | 1:12 PM

Viral News: వారిది నిరుపేద కుటుంబం. తెలంగాణలోని సిద్దిపేట(Siddipet) పట్టణంలో పాత బట్టలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు.  కానీ దైవం అంటే మాత్రం చెప్పలేనంత భక్తి.  ఆ కుటుంబంలోని పెద్దావిడ కలలో దైవం ప్రయత్యక్షమై తనకు గుడి కట్టాలని కోరింది. దీంతో ఆ ఫ్యామిలీలో ఉన్న 15 మంది సభ్యులు ఎంతో కష్టించి అర్జించిన 35 లక్షలలో అమ్మవారికి గుడి కట్టించారు. ధృడ సంకల్పం ఉంటే ఎంత అసాధ్యం అయిన పనినైనా సాధ్యం చేయవచ్చు. అందుకు ఈ కుటుంబం కూడా ఉదాహారణ. ప్రతి రోజు వివిధ గ్రామాల్లోకి వెళ్లి.. ఇంటి ఇంటికి తిరుగుతూ పాత బట్టలు కొనుకుంటూ, తిరిగి వాటిని అమ్ముకునే చిరు వ్యాపారం వారిది. వారు నివసించేది బొంతల గుడిసెలో. అమ్మవారు కలలో కన్పించి గుడి కట్టాలని కోరడంతో.. తుల్జా భవాని అమ్మవారి కోసం ఏకంగా మూడు అంతస్థుల దేవాలయం కట్టారు. పేదరికాన్ని ఎదిరించి లక్షలు వెచ్చించి.. ఎట్టకేలకు  దేవాలయం నిర్మాణం పూర్తి చేశారు. సిద్దిపేట పట్టణంలోని సంజీవయ్య నగర్ కాలనీలో నివాసం ఉండే ఈగ్వే కుటుంబీకులు.. తాజాగా నిర్మాణం పూర్తయిన తుల్జా భవాని మాత నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. భక్తులను పిలిచి అన్నదానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..  60 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి,  ఆ ప్రదేశంలో అమ్మవారి ఆలయం నిర్మించామని తెలిపారు. పాత బట్టల వ్యాపారం మీద 12 సంవత్సరాలు సొంతంగా కష్టపడి  వచ్చిన 35 లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణం కోసం వినియోగించనట్లు తెలిపారు. ఎవరి వద్ద నుండి చందాలు వసూలు చేయలేదని వెల్లడించారు. అమ్మవారిని దర్శించు కోవడానికి భక్తులు రావడం.. ఎంతో సంతోషంగా ఉందన్నారు.  అమ్మవారి కృప కటాక్షాల వల్ల ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..