AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుభవం ఉన్న డ్రైవర్ల వల్లే అధిక ప్రమాదాలు

అనుభవం ఉన్న డ్రైవర్లే యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. తమకు అన్నీ తెలుసు అని ధోరణితోపాటు తాము ఎలాగైనా వాహనం నడపగలను అని ధీమాతో రెక్ లెస్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పదేళ్లకు పైబడి డ్రైవర్‌గా అనుభవం ఉన్నవారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది.

అనుభవం ఉన్న డ్రైవర్ల వల్లే అధిక ప్రమాదాలు
Road Accident
Lakshmi Praneetha Perugu
| Edited By: Ram Naramaneni|

Updated on: Oct 13, 2023 | 9:54 PM

Share

ఓవర్ స్పీడింగ్ కారణంగా ప్రతిరోజు అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.. అయితే ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది.. గతంలో NCRB(National Crime Records Bureau)రిపోర్టు ప్రకారం 24 గంటల వ్యవధిలో తెలంగాణలో సగటున 20 ప్రమాదాలు చోటు చేసుకునేవి.. అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అనుభవం ఉన్న డ్రైవర్ల వల్లే జరుగుతున్నాయి అని RASTA సంస్థ జరిపిన సర్వే లో తేలింది. NCRB రిపోర్టు ప్రకారం తెలంగాణలో ఏడాది కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 7447 మంది మరణించగా 20 వేలకు పైగా వ్యక్తులు గాయపడ్డారు. 55.5 % రోడ్డు ప్రమాదాలు ఓవర్ స్పీడింగ్ వల్ల చోటు చేసుకోగా 27.5 శాతం రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా చోటుచేసుకున్నాయి.

అనుభవమున్న డ్రైవర్లలే యమకింకరులు

రోడ్డు ప్రమాదాలపై RASTA జరిపిన సర్వే ప్రకారం, అత్యధికంగా అనుభవం ఉన్న డ్రైవర్లే రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా వాహనం నడుపుతున్న వారిలో పదేళ్లకు పైగా డ్రైవర్‌గా అనుభవం ఉన్నవారే ఎక్కువ. తాజా సర్వే ప్రకారం పదేళ్లకు పైబడి డ్రైవర్‌గా అనుభవం ఉన్నవారు చేసిన ప్రమాదాల సంఖ్య అక్షరాల 119… గడిచిన కొన్ని నెలల పాటు జరిగిన రోడ్ ప్రమాదాలను పరిశీలించిన సంస్థ గణాంకాలతో సహా వివరాలు వెల్లడించింది. వీరిలో పదేళ్లకు పైబడి డ్రైవర్‌గా అనుభవం ఉన్నవారు నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారని వెల్లడైంది.

సంస్థ జరిపిన సర్వే ప్రకారం గణాంకాలు ఇలా ఉన్నాయి.

డ్రైవర్లు అనుభవం — ప్రమాదాల సంఖ్య:

  • 5 ఏళ్లు – 63 ప్రమాదాలు
  • 6-10ఏళ్లు – 91 ప్రమాదాలు
  • 10 ఏళ్లుకు పైబడి అనుభవం —  119 ప్రమాదాలు.

అనుభవం ఉన్న డ్రైవర్లే యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.. తమకు అన్నీ తెలుసు అని ధోరణితోపాటు తాము ఎలాగైనా వాహనం నడపగలను అని ధీమాతో రెక్ లెస్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..