Telangana Elections: అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా.. ఆ నేతలకు షాక్ ఇచ్చిన స్క్రీనింగ్ కమిటీ..!
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఆలస్యమవడంతో.. తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే 70 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపిన కాంగ్రెస్.. మిగతా అభ్యర్థులను ఎంపిక చేసి అక్టోబర్ 15వ తేదీన పూర్తి లిస్ట్‌ను ఒకేసారి ప్రకటిస్తామంది.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఆలస్యమవడంతో.. తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే 70 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపిన కాంగ్రెస్.. మిగతా అభ్యర్థులను ఎంపిక చేసి అక్టోబర్ 15వ తేదీన పూర్తి లిస్ట్‌ను ఒకేసారి ప్రకటిస్తామంది. ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ వెల్లడించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కసర్తతు చేసింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్.. అభ్యర్థుల ఎంపికపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామని మురళీధరన్ తెలిపారు. కాంగ్రెస్ విడుదల చేయనున్న జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే, తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయతను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జరిగిన సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయ్యిందన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరుసటి భేటీలో మిగతా స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అయితే, ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలో పొత్తుకు అవకాశం ఉన్నందున.. మిత్రపక్షాల స్థానాలపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు మురళీధరన్. అవి పూర్తయిన తరువాత కాంగ్రెస్ మొత్తం అభ్యర్థుల జాబితాను ఒకే దఫా ప్రకటిస్తామని తెలిపారు మురళీధరన్.
ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్ల కేటాయింపు..
అయితే, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు టికెట్లు ఆశించి కాంగ్రెస్ సీనియర్ నేతలకు, కాంగ్రెస్‌లో చేరిన నేతలకు ఝలక్ ఇచ్చింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు మురళీధరన్. ఈ జాబితాలో మైనారిటీలకు, మహిళలకు, బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందన్నారు. ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించామనేది.. లిస్ట్ విడుదలైన తరువాత అందరూ చూస్తారన్నారు.
పొన్నాల రాజీనామాపై షాకింగ్ రియాక్షన్..
మాజీ మంత్రి, జనగామ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీ మార్పు అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. పోతీ పోనివ్వండి అంటూ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పొన్నాల రాజీనామాపై స్పందించారు. రాజీనామాల అంశాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




