AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender wife : హుజురాబాద్ ప్రచారంలో ఈటల జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "పోటీలో నేను ఉన్నా....

Etela Rajender wife  : హుజురాబాద్ ప్రచారంలో ఈటల జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు
Etela Jamuna
Venkata Narayana
|

Updated on: Jul 18, 2021 | 2:14 PM

Share

Etela Rajender wife Jamuna : హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ సతీమణి జమున ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “పోటీలో నేను ఉన్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటే, ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి అవకాశం వస్తే వారు పోటీ చేయాలన్న ఆలోచన ఉంది. ఎవరు పోటీ చేసినా గుర్తు అదే ఉంటుంది. కాకపోతే మనుషులే మారొచ్చు” అని జమున అన్నారు. ఆదివారం ఆమె, హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె నియోజకవర్గ ప్రజలకు పలు హామీలిచ్చారు. తమకు అండగా ఉండాలని అభ్యర్థించారు.

మరోవైపు, హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగనున్న ఉప ఎన్నిక.. ధర్మం, న్యాయం కాపాడటంలో, ఆహాంకారాన్ని ఓడించడానికి జరుగుతున్న ఎన్నిక అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన హుజూరాబాద్‌లో ఎగిరేదీ కాషాయం జెండానే అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఈటల విస్తృతంగా పర్యటిస్తున్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఈటల.. హుజురాబాద్ ఒక్కటే కాదు రాష్ట్రమంటా టీఆర్ఎస్ వ్యతిరేక పరిస్థితి ఉందని తెలిపారు.

చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరన్నారు ఈటల. ప్రజల్లో బలమున్నవారు ఇలా చెయ్యరని చెప్పారు. ఎస్సీల జనాభా 16 -17 శాతం ఉంటుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారన్నారు. 0.5 శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడబోమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

Read also: Vizianagaram MP : అశోక్ గజపతిరాజు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయనగరం ఎంపీ