huzurabad trs candidate: హుజూరాబాద్‌లో హీట్ పెంచుతున్న రాజకీయాలు..టీఆర్‌ఎస్ క్యాండిడేట్‌పైనే అంతా ఫోకస్..
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు.. కానీ రాజకీయం మాత్రం ఫుల్ హీటెక్కుతోంది. గెలుపు కోసం మూడు పార్టీలు మేథోమథనం చేస్తున్నాయి. అయితే హుజూరాబాద్ బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు.. కానీ రాజకీయం మాత్రం ఫుల్ హీటెక్కుతోంది. గెలుపు కోసం మూడు పార్టీలు మేథోమథనం చేస్తున్నాయి. అయితే హుజూరాబాద్ బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. సొంత పార్టీ నేతలా? ఇతర పార్టీల నుంచి వచ్చే వారా? హుజూరాబాద్‌లో TRS నుంచి పోటీ చేసేదెవరు? మూడు పార్టీల నుంచి ముగ్గురు నేతల పేర్లు సిద్ధమయ్యారట. వాళ్లలోనే ఒకరు ఈటలను ఢీకొట్టడం ఖాయమనేది లేటెస్ట్ టాక్. ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హుజూరాబాద్‌లో మళ్లీ హీటెక్కుతున్నాయి. చెప్పాలంటే అన్ని పార్టీలూ ఫోకస్ పెట్టింది అక్కడే.
లేటవుతుందీ అనుకున్న టీఆర్‌ఎస్ అందరికంటే మందుగా ఫామ్‌లోకి వచ్చేసింది ఈటల రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఎవరిని బరిలోకి దింపాలా అన్న అంశంపై అప్పుడే కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నిక ఎప్పుడు ఉంటుందో గానీ.. ఎలాగైనా గెలిచి ఈటలను దారుణంగా దెబ్బతియ్యాలన్నంత కసి టీఆర్‌ఎస్ వ్యూహాల్లో కనిపిస్తోంది.
కౌశిక్‌రెడ్డి వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. 2009, 2010లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తన అవకాశాలు సజీవంగా ఉన్నాయని భావిస్తున్నారు. బీసీ నాయకుడిగా, గతంలో రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తిగా తనకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా పార్టీ అభ్యర్థిత్వంపై ఆశతో ఉన్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్ టికెట్టు ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, ఆయనతో సంప్రదింపులు జరగలేదు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబాన్ని ఎంత మేర పరిగణలోకి తీసుకుంటారో తెలియదు.
లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే.. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పురుషోత్తంరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి దామోదర్‌రెడ్డి సోదరుడు ముద్దసాని పురుషోత్తంరెడ్డిని పోటీలో పెడితే ఎలా ఉంటుందా అన్న ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్ ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు.
ఇక మిగతా పక్షాల మాటెలా ఉన్నా.. పోటీ మాత్రం టీఆర్‌ఎస్, బీజేపీ అన్నట్టుగానే ఉండే అవకాశాలున్నాయి.