సోనియా గాంధీ ‘తంత్రం’ ! ‘జీ-23’ అసమ్మతి నేతలకూ తలా కాస్త…కాంగ్రెస్ పార్లమెంటరీ గ్రూపుల్లో శశిథరూర్, మనీష్ తివారీలకూ చోటు
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను పునర్వ్యవస్థీకరించారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండడంతో ఆదివారం ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఏకంగా పార్టీ నాయకత్వంపైనే...
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను పునర్వ్యవస్థీకరించారు. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండడంతో ఆదివారం ఈ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది ఏకంగా పార్టీ నాయకత్వంపైనే తిరుగుబాటు వంటిది చేసి 23 మంది నేతలు తమ సంతకాలతో అధిష్టానానికి లేఖ పంపిన వారిలో కొందరిని ఆమె కరుణించారు. లోక్ సభలో ఏడుగురు సభ్యుల గ్రూపులో శశిథరూర్, మనీష్ తివారీలకు ఆమె చోటు కల్పించారు. ఇక ఇదే సభలో యధా ప్రకారం అధిర్ రంజన్ చౌదరి సభా నాయకుడిగా, గౌరవ్ గొగోయ్ డిప్యూటీ నేతగా కొనసాగుతారు. అధిర్ రంజన్ ని మార్చవచ్చునని వార్తలు వచ్చినప్పటికీ ఆయననే కొనసాగాలని నిర్ణయించారు. సభలో చీఫ్ విప్ గా కె.సురేష్, పార్టీ విప్ లుగా రవనీత్ సింగ్ బిట్టూ, మాణిక్యం ఠాగూర్ వ్యవహరిస్తారు.ఇక రాజ్యసభలో మల్లిఖార్జున్ ఖర్గే సభా నాయకుడిగా, ఆనంద్ శర్మ డిప్యూటీ లీడర్ గా వ్యవహరించనున్నారు. (జీ-23 గ్రూప్ లో ఆనంద్ శర్మ కూడా ఉన్న విషయం గమనార్హం).
అలాగే ఎగువ సభలో జైరాం రమేష్ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. అంబికా సోనీ, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కె.సి.వేణుగోపాల్ ఈ గ్రూప్ లో సభ్యులుగా ఉంటారు. ఇవి పార్లమెంట్ సెషన్ లు జరిగే ప్రతి రోజూ సమావేశమవుతాయని, ఇంటర్ సెషన్ పీరియడ్ లోనూ భేటీ అవుతాయని సోనియా ఓ ప్రకటనలో తెలిపారు. అవసరమైనప్పుడు ఈ గ్రూపులు జాయింట్ మీటింగులు కూడా నిర్వహిస్తాయి. వీటికి మల్లిఖార్జున్ ఖర్గే కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ గ్రూపుల్లో రాహుల్ గాంధీ పాత్ర ఏదీ లేకపోవడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి : Anushka Shetty Video:స్వీటీ మూవీ పై గుసగుసలు.. అనుష్క సినిమా ఆగిపోయిందా..(వీడియో).
హైదరాబాద్ లో ఆశర్యం..!బాబోయ్…సమాధి కింద శవం..! పదేళ్లయినా చెక్కుచెదరని శరీరం..:Hyderabad.
వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు గ్రేట్ గుడ్ న్యూస్.. వచ్చే రెండేళ్లపాటు రిమోట్ పని..:Knowlodge Video.