Passenger trains: ప్యాసింజర్లు కూడా ఎక్స్‌ప్రెస్‌లా పరుగు.. సామాన్యులకు రైల్వే గుడ్ న్యూస్.. తక్కువ ధర టికెట్‌తోనే వేగంగా..

Passenger train speed: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ముందు ప్యాసింజర్ రైలు కూడా వాయువేగంతో దూసుకు పోనుంది. వాటిని కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగంతో నడిపించాలని..

Passenger trains: ప్యాసింజర్లు కూడా ఎక్స్‌ప్రెస్‌లా పరుగు.. సామాన్యులకు రైల్వే గుడ్ న్యూస్.. తక్కువ ధర టికెట్‌తోనే వేగంగా..
South Central Railway
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 18, 2021 | 1:47 PM

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ముందు ప్యాసింజర్ రైలు కూడా వాయువేగంతో దూసుకు పోనుంది. వాటిని కూడా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగంతో నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. గతంలో ఇవి తక్కువ వేగంతో ప్రయాణించేవి… టికెట్‌ ధర తక్కువ అయినా.. అధిక సమయం ప్రయాణంతో విసుగుపుట్టేది. తమ గమ్యస్థలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే స్థాయిలో దాని పరుగు ఉండేది. ప్యాసింజర్ రైలును ప్రయాణం తర్వాతే జనం మధ్య వివిధ రకాల సమేతలు వచ్చాయి.

ఇక భారతీయ రైలు ఆలస్యం అనే మాట రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా మార్పులు చేస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి దశలవారీగా పునరుద్ధరిస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే  ప్రకటించింది. అన్‌ రిజర్వుడ్‌ ప్యాసింజర్‌ రైళ్ల వేగాన్ని మరింత పెంచుతున్నట్లు ద.మ.రైల్వే ఈ ప్రకటన చేసింది.

ట్రాక్‌ల పటిష్ఠానికి రైల్వే శాఖ గతేడాది అనేక పనులు చేపట్టింది. దీంతో జోన్‌ నెట్‌వర్క్‌లోని వివిధ సెక్షన్ల పరిధిలో రైళ్లు వీలైనంత వేగంతో ప్రయాణించే అవకాశం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌ మెరుగుపడటంతో ప్రయాణ సమయం తగ్గుతుంది. అన్‌ రిజర్వుడ్‌ ప్యాసింజర్లను అన్‌ రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా నడిపేందుకు వీలు కలిగింది. రద్దయిన 82 సర్వీసుల్ని పునరుద్ధరిస్తున్నాం’ అని ద.మ.రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు.

కౌంటర్లు, యాప్‌లో టికెట్లు

ప్రయాణికులు రైల్వే స్టేషన్లలోని కౌంటర్లతో పాటు మొబైల్‌ ఫోన్‌లో యూటీఎస్‌ యాప్‌, స్టేషన్లలో ఏటీవీఎం(ఆటోమెటిక్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌), సీవోటీవీఎం(కాయిన్‌/క్యాష్‌ ఆపరేటెడ్‌ టికెట్‌ వెండింగ్‌ మెషిన్‌)లో కూడా టికెట్లు తీసుకోవచ్చని ద.మ.రైల్వే తెలిపింది. కొవిడ్‌ దృష్ట్యా కౌంటర్ల దగ్గర రద్దీ లేకుండా యూటీఎస్‌ యాప్‌, ఏటీవీఎం, సీవోటీవీఎంలు వినియోగించుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించనున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్

viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..