Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్

ఇది అంతు చిక్కని రహస్యం.. ఎవరూ తేల్చని మర్మం.. మాయా ప్రపంచం.. దీనిని రెండో బెర్మడా ట్రయాంగిల్ అంటారు. ఇక్కడికి వెళ్లినవారు తిరిగిరారు.. వారి ఆచూకి కూడా లభించలేదు.. అసలు ఇది ఎక్కడుందో.. ఎలా ఉంటుందో..

Most Mysterious: షాంగ్రి-లా లోయ.. ఇది అంతు చిక్కని రహస్యం.. ఇంత వరకు ఎవరూ తేల్చని మర్మం..ఇది రెండో బెర్ముడా ట్రయాంగిల్
Shangri La Valley
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 18, 2021 | 11:03 AM

ఓ కవి చెప్పినట్లు.. ఈ ప్రపంచం ఓ అద్భుతమైన రహస్యం… ఈ భూ మండలం రహస్యాలతో నిండి ఉంది. భూమిపై మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. దీని గురించి ఎవరికీ ఏమీ తెలియదు. అలాంటి ఒక రహస్య లోయ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ మధ్య ఉంది. ఈ రోజు వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ స్థలాన్ని ‘షాంగ్రి-లా వ్యాలీ’ అని పిలుస్తారు. షాంగ్రి-లా లోయ గురించి చాలా కథలు చెప్పబడ్డాయి. ఇక్కడ సమయం ఆగిపోతుందని.. ప్రజలు తమకు కావలసినంత కాలం జీవించగలరు అని.. ఇలాంటి చాలా సంగతులు ప్రచారంలో ఉన్నాయి.

దీంతో ఇది పెద్ద చర్చగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ‘షాంగ్రి-లా వ్యాలీ’ని గుర్తించడానికి ప్రయత్నించారు.. కాని ఇప్పటి వరకు ఎవరూ విజయవంతం కాలేదు. ప్రఖ్యాత తంత్ర సాహిత్య రచయిత అరుణ్ కుమార్ శర్మ తన ‘దట్ మిస్టీరియస్ వ్యాలీ ఆఫ్ టిబెట్’ పుస్తకంలో ఈ స్థలాన్ని ప్రస్తావించారు. అతని ప్రకారం ప్రపంచంలో ఒక వస్తువు లేదా ఎవరైన వ్యక్తి కనిపించకుండా పోయేది ఎక్కడా అంటే ముందుగా బెర్ముడా ట్రయాంగిల్… ఆ తర్వాత స్థానంలో ఈ షాంగ్రి లా వ్యాలీ నిలుస్తుందని అంటాడు.

ఇది ఒక ఫాంటసీ ప్రదేశం

ఈ లోయ గురించి ప్రస్తావించడం టిబెటన్ భాషాలో ప్రచూరించిన పుస్తకం ‘కాల్ విజ్ఞన్’ లో కూడా ఉంది. జేమ్స్ హిల్టన్ అనే రచయిత తన ‘లాస్ట్ హారిజన్’ పుస్తకంలో కూడా ఈ మర్మమైన ప్రదేశం గురించి రాశాడు. అయితే అతని అంచనా ప్రకారం ఇది ఒక కల్పిత ప్రదేశం. టిబెటన్ పండితుడు యుట్సుంగ్ ప్రకారం. ఈ లోయ కొంత అంతరిక్ష ప్రపంచానికి సంబంధించినది. ఈ లోయ భారతదేశంతో పాటు ప్రపంచంలో కూడా ఆధ్యాత్మిక క్షేత్రం… తంత్ర సాధన లేదా తంత్ర జ్ఞానంతో సంబంధం ఉన్నవారికి ప్రసిద్ధి చెందింది. ఇలాంటి చాలా వాదనలు, ప్రస్తావనలు చేశారు రచయితలు. ఈ ప్రదేశం ఇలా ఉంటుంది… అలా ఉంటుందని రాసిన రచయితలు షాంగ్రి-లా లోయ  రహస్యాన్ని మాత్రం పరిష్కరించలేకపోయారు.

బెర్ముడా ట్రయాంగిల్…

షాంగ్రి-లా లోయ కంటే ముందు ప్రపంచం మొత్తం తెలిసిన.. బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం.. వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే “డెవిల్స్ ట్రయాంగిల్” అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు… ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసి పోయాయని తెలుస్తున్నది. అయినాగాని, ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది.

ఇవి కూడా చదవండి: viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

IRCTC Tatkal Ticket: ఈ చిన్న చిట్కాతో తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ చాలా ఈజీ.. ఓ సారి మీరు ట్రై చేయండి..

Tirumala Laddu: కొత్త ప్యాకింగ్‌లో తిరుమల లడ్డూ.. కూరగాయల వ్యర్థాలతో లడ్డు బ్యాగ్.. ఎలా తయారు చేస్తారో తెలుసా..