Heavy Rain: కుండపోత వర్షానికి హైదరాబాద్‌లో బీభత్సం.. నీటిలో కొట్టుకుపోయిన కారు
హైదరాబాద్ నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోతున్నాయి.
హైదరాబాద్ నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతికి కార్లు కొట్టుకుపోతున్నాయి. ముషీరాబాద్ పరిధిలో రామ్ నగర్, పార్సిగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీ నీట మునిగాయి. పార్సిగుట్ట పరిసర ప్రాంతాలు ప్రమాద అంచున ఉన్నాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి కాలనీ చెరువులను తలపిస్తున్నారు. ఈ క్రమంలో పార్సిగుట్టలో వర్షం నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు ఓ మలుపు వద్ద తాళ్లతో బంధించారు.
మరోవైపు, జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో రెండు గంటలపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. శామీర్ పేట్, హకీంపేట్, శంషాబాద్, హయత్ నగర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..