Attar Perfume: రంజాన్‌ జోష్‌.. ఓల్డ్ సిటీలోని అత్తర్‌కు ఫుల్ క్రేజ్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్

సాధారణ రోజుల్లో అత్తరు వ్యాపారం కంటే రంజాన్‌, పండుగ రోజుల్లో రెట్టింపు ఉంటుందంటున్నారు ఇక్కడి వ్యాపారులు...రంజాన్ మాసం వస్తే చాలు.. ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసరాలు మరింత రద్దీగా మారతాయి. గాజుల నుండి అత్తర్ వరకు రంజాన్ సీజన్ లో ఇక్కడ దొరికే వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది.

Attar Perfume: రంజాన్‌ జోష్‌.. ఓల్డ్ సిటీలోని అత్తర్‌కు ఫుల్ క్రేజ్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్
Attar Perfume In Hyderabad
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2023 | 1:04 PM

రంజాన్‌ మాసంలో అత్తర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అత్తర్‌ వాడందే ముస్లింలు బయటకు వెళ్లరు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల మార్కెట్లో అత్తర్‌ విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్య పండగలకు, పెళ్లిళ్ల సీజన్లలో అత్తర్‌కు గిరాకీ ఎక్కువగా ఉన్నా.. రంజాన్‌ మాసంలో మాత్రం వివిధ రకాల అత్తర్లకు అత్యధికంగా డిమాండ్‌ ఉంటుంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్‌ వాడతారు.

అత్తర్‌ తయారీ విధానం.. గులాబీ రేకులు, మల్లెపువ్వులు, మొఘలిపువ్వులు, గంధపు చెక్కలు ఏదైనా కానివ్వండి దేని అత్తర్‌ కావాలో దాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన బట్టిలలోని డెకీసాలలో వేస్తారు. డేకీసా పైన మూతకు ఒక చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చే విధంగా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అసలు సిసలు ‘అత్తర్‌…చలి కాలంలో షామతుల్ అమ్, హ్రీనా, జాఫ్రాన్, దహనల్ ఊద్ వంటి అత్తర్లు వాడితే ఒంటికి వెచ్చదనం లభిస్తుంది. జన్నతుల్ ఫిర్దోస్, మజ్మా, షాజహాన్, మన్నా, నాయబ్, హుప్, బకూర్, మొకల్లత్, ఖస్, ఇత్రేగిల్, షమతుల్ అంబర్, హీనా, జాఫ్రత్, దహనుల్ ఊద్ వంటి అత్తర్లు మార్కెట్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని వాడే కస్టమర్లు ప్రత్యేకించి తెప్పించుకోవడం, తయారు చేయించుకోవడం కూడా జరుగుతుంది.

అరబ్‌ దేశాల్లో ఉపయోగించే అత్తరు: హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీ మార్కెట్లో లభించే కొన్ని రకాల అత్తర్లు తులం రూ.200 నుంచి మొదలవుతున్నాయి. అంటే వాటి ప్రత్యేకత ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అరబ్ దేశాల్లో ఉపయోగించే దహనల్ ఊద్ అనే అత్తరు తులం రూ.2 వేల నుంచి రూ.6వేల ధర పలుకుతోంది. రాత్ కి రాణి, ముస్క్ రోజ్, బ్లాక్ ముస్క్, వైట్ ముస్క్, కూలీ బ్రీజ్, జమ్ జ్ ప్లవర్ అత్తర్లు చాలా ఖరీధైనవి. వీటిని 3 మి.లీ నుంచి అమ్ముతారు. వీటి ధర 3 మి.లీలకు రూ.30 తీసుకుంటారు. సాధారణ రోజుల్లో అత్తరు వ్యాపారం కంటే రంజాన్‌, పండుగ రోజుల్లో రెట్టింపు ఉంటుందంటున్నారు ఇక్కడి వ్యాపారులు…రంజాన్ మాసం వస్తే చాలు.. ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసరాలు మరింత రద్దీగా మారతాయి. గాజుల నుండి అత్తర్ వరకు రంజాన్ సీజన్ లో ఇక్కడ దొరికే వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. చిన్న చిన్న దుకాణాలు ఇక్కడ వందల సంఖ్యలో ఉంటాయి. వీటిలో అత్తర్ విక్రయించే కొన్ని చిన్న దుకాణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని 1897 నుండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడకి వచ్చే సాధారణ ప్రజలకివి దాదాపు క్యూరియో షాపుల లాగా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

300 నుంచి 400 వెరైటీ అత్తర్ మార్కెట్లో వచ్చాయి ఫ్యాన్సీ బాటల్స్ లో అవి నింపిన తర్వాత అమ్ముతుంటే చాలా అందంగా ఉంటాయి అత్తర్ అనేది ప్రతి ఒక్కరూ వాడతారు పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ వ్యాపారం ఎక్కువగా నడుస్తుంది ప్రస్తుతం వ్యాపారంలచాలా బాగా నడుస్తుంది. రంజాన్ పవిత్రమైన మాసంలో విదేశాల నుంచి కొత్త కొత్త వెరైటీల అత్తర్ వస్తుంటాయి ఈసారి అత్తర్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ లో వస్తుంది అలాంటి అత్తర్ వాడి నమాజ్ చేసుకోవచ్చు.

Reporter: Noor Mohammed

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..