AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగుబోతుల వీరంగం.. ఒకడు భార్యను బస్సు కింద తోసేస్తే, మరోకడు రోడ్డుపై వాహనాలను ఆపేశాడు!

తాగుబోతు వీరంగం సృష్టించాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. మద్యం మత్తులో పోలీసులు అడ్డుకున్నారని, కట్టుకున్న భార్యను బస్సు కిందకు తోసేశాడు ఓ భర్త. మరో ఘటనలో నడిరోడ్డుపై అర్థనగ్నంగా వాహనాలను అడ్డుకుని బీభత్సం సృష్టించాడు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మద్యం బాబులను అదుపులోకి తీసుకున్నారు.

తాగుబోతుల వీరంగం.. ఒకడు భార్యను బస్సు కింద తోసేస్తే, మరోకడు రోడ్డుపై వాహనాలను ఆపేశాడు!
Drunkards Create Ruskus
Balaraju Goud
|

Updated on: Mar 16, 2025 | 7:48 AM

Share

తాగుబోతు వీరంగం సృష్టించాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. మద్యం మత్తులో పోలీసులు అడ్డుకున్నారని, కట్టుకున్న భార్యను బస్సు కిందకు తోసేశాడు ఓ భర్త. మరో ఘటనలో నడిరోడ్డుపై అర్థనగ్నంగా వాహనాలను అడ్డుకుని బీభత్సం సృష్టించాడు. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మద్యం బాబులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో అర్దరాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. భార్యను నడుస్తున్న ఆర్టీసీ బస్సు కిందకు తోసేశాడు భర్త. దీంతో భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమె అపరమారక స్థితిలో నడిరోడ్డుపై పడిపోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చే వరకు తీసుకువెళ్లకుండా తాత్సారం చేశారు. గాయపడ్డ మహిళను అంబులెన్స్‌లో దాదాపు 40 నిమిషాలు అక్కడే ఉంచారు. 40 నిమిషాల తరువాత పోలీసులు రావడంతో మహిళను హాస్పిటల్‌కు తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అటు నంద్యాల జిల్లా నందికొట్కూరులో మందుబాబు రెచ్చిపోయాడు. బస్టాండ్ సమీపంలో కేజి రోడ్డుపై బస్సులను, వాహనాలను అడ్డగించి హల్ చల్ చేశాడు ఓ యువకుడు. అర్ధనగ్నంగా బస్సులకు అడ్డంగా నిలబడి వీరంగం సృష్టించాడు తాగుబోతు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని తప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. తాగుబోతును కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. చివరికి ఎలాగోలా అతన్ని స్థానికుల సాయంతో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..