AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly: మళ్లీ చెబుతున్నా గుర్తుపెట్టుకోండి.. బీజేపీ ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి డైరెక్షన్‌..

సోమవారం నుంచి అసెంబ్లీలో ట్రయాంగిల్‌ వార్‌ షురూ కాబోతోందా..? జగదీష్‌ రెడ్డి ఎపిసోడ్‌తో నిన్నటిదాకా కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్ఎస్‌గా నడిచిన సభను.. బీజేపీ తనవైపు టర్న్‌ చేసుకోబోతోందా..? బడ్జెట్‌ సెషన్స్‌ జరుగుతున్న తీరుపై కమలంపార్టీ ఎమ్మెల్యేతో చర్చించిన కిషన్‌రెడ్డి.. నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు.. కిషన్‌రెడ్డి నేతలకిచ్చి క్లియర్‌ కట్‌ పిక్చర్‌ ఏంటి...? అనేది ఈ కథనంలో తెలుసుకోండి..

Telangana Assembly: మళ్లీ చెబుతున్నా గుర్తుపెట్టుకోండి.. బీజేపీ ఎమ్మెల్యేలకు కిషన్‌రెడ్డి డైరెక్షన్‌..
Telangana Bjp
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2025 | 7:16 AM

Share

తెలంగాణ అసెంబ్లీలో నిన్నటిదాకా జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌ సినిమానే నడిచింది. అసెంబ్లీ మొత్తం కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ మధ్యే అన్నట్లుగా ఉంది. సభలో అసలు బీజేపీ ఊసే లేకుండా పోయింది..! దీంతో అసెంబ్లీ సమావేశాలపై కమలనాథులు కూడా ఓ నజర్‌ వేశారు. బడ్జెట్ సెషన్స్‌ జరుగుతున్న తీరుపై చర్చించి.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. వాళ్లిద్దరి సమరంలో బీజేపీ సైడైపోకుండా ఫుల్ గైడెన్స్ ఇచ్చారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఏడాదిన్నర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించారు కిషన్‌ రెడ్డి. హామీల అమలుపై గట్టిగా నిలదీయాలన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా సభలో మాట్లాడాలన్నారు. సభలో మాట్లాడేటప్పుడు భాష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. విమర్శించారు కదా అని ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోయి ఏదిపడిదే అది మాట్లాడొద్దని వార్నింగ్‌ ఇచ్చారు. అంతేకాదు.. మాట్లాడాలనుకునే అంశాన్ని ముందుగానే నిర్ణయింకోవాలని సూచించారు. ఎవరు ఏ టాపిక్‌ మీద మాట్లాడాలో పక్కా ప్లాన్‌తో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నారు కిషన్‌ రెడ్డి.

ఆ రెండు పార్టీలు ఏ అంశంపై కొట్టుకున్నా సరే.. ప్రజాసమస్యలపై సమగ్ర చర్చకు పట్టుబట్టాల్సిందిగా బీజేపీ నేతలకు కిషన్‌ రెడ్డి సూచించారు. అలాగే.. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, అభివృద్ధికి సహకరిస్తున్న విధానాన్ని అసెంబ్లీలో వినిపించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలకు తెలిపారు. రాష్ట్రానికి ఏం చేయలేదంటూ కేంద్రంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలను లెక్కలతో సహా తిప్పికొట్టాలని సూచించారు.

మళ్లీ చెబుతున్నా గుర్తుపెట్టుకోండి.. సభలో బీజేపీ పోరాటం కేవలం ప్రజాసమస్యలపైనే అంటూ రిపీటెడ్ డైలాగ్‌ వినిపిస్తూనే నేతలకు క్లియర్‌ కట్‌గా డైరెక్షన్‌ ఇచ్చారు కిషన్‌ రెడ్డి. సోమవారం సభ ఎలా ఉండబోతోంది..? బీజేపీ ఏం చేయబోతోందో..? వేచి చూడాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..