Hyderabad: బాప్రే..! డ్రంక్ అండ్ డ్రైవ్లో సరికొత్త రికార్డ్.. కేవలం 15 రోజుల్లో ఇన్ని కేసులా..
మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఏకంగా 3,000 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ రెండోసారి పోలీసులకు పట్టబడ్డారు.
మూడు కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఏకంగా 3,000 మంది మద్యం సేవించి వాహనం నడుపుతూ రెండోసారి పోలీసులకు పట్టబడ్డారు. గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాహనదారుల గణాంకాలను ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. సుమారు 3000 మంది రెండవసారి మద్యం తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడ్డారు.
వీరిలో తరచుగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. 2023 జనవరి నుండి ఇప్పటివరకు 1587 మంది మద్యం సేవించి వాహనం నడిపిన వారిని పోలీసులు పట్టుకున్నారు. వీరంతా రెండవసారి మద్యం సేవించి ఏదేచ్ఛగా వాహనం నడుపుతూ పోలీసులు తనిఖీల్లో పట్టుబడినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో సైబరాబాద్ ఉంది. సైబరాబాద్లో ఎక్కువగా పదేపదే మద్యం సేవించి వాహనం నడిపిన వారు 956 మందిగా చెబుతున్నారు. వీరంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలోనే పోలీసులకు పట్టుబడ్డారు.
లోకల్ ట్రాఫిక్ పోలీసులు ప్రతి వీకెండ్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. వాహనదారులకు BAC (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో కొంతమందికి ఫైన్లతో సరి పెడితే.. మరికొంతమందిని కోర్టులకు హాజరుపరుస్తున్నారు. వారిపై విచారణ జరిపిన న్యాయస్థానాలు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఎక్కువసార్లు పట్టుబడుతున్న వారికి జైలు శిక్షను విధిస్తున్నాయి. కేవలం జూలై నెలలోనే 2,483 మంది వాహనదారులను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారు. 15 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇంతమంది పట్టుబడటం సరికొత్త రికార్డుగా చెబుతున్నారు పోలీసులు. పదేపదే తాగి వాహనం నడిపి పోలీసులకు పట్టుబడితే ఫైన్ తో పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తున్నారు పోలీసు అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..