AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం ఇదే..

గ్రామాలు మంచం పడుతున్నాయి. పల్లె ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్స్ నుండి బయటపడడం లేదు. జ్వరం తగ్గిన కూడ కోలుకోవడానికి సమయం పడుతుంది. ఒంటి నొప్పులతో ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదు.

నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం ఇదే..
Karimnagar
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 19, 2024 | 9:31 PM

Share

గ్రామాలు మంచం పడుతున్నాయి. పల్లె ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్స్ నుండి బయటపడడం లేదు. జ్వరం తగ్గిన కూడ కోలుకోవడానికి సమయం పడుతుంది. ఒంటి నొప్పులతో ఒక అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఎవరైనా సహాయకులు ఉంటేనే కాలు తీసి కాలు ముందుకు పెడుతున్నారు.

ఉమ్మడి ‌కరీంనగర్ గ్రామీణ ప్రాంతాలు జ్వరాల నుండి కోలుకొవడం లేదు. నెల రోజుల నుండి జ్వరంతో‌ సతమతమౌతున్నారు. జ్వరం వచ్చిన తరువాత ఒళ్ళు నొప్పులు బాధ పెడుతున్నాయి. జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ చాలా మంది బాధితులు ఒక అడుగు కూడ ముందుకు వేయలేక పోతున్నారు. ఓవైపు ఆసుపత్రి ఖర్చు మరోవైపు ఇతర పనులన్నీ ఆగిపోవడంతో అర్థికంగా ఇబ్బందులు ‌పడుతున్నారు. ఇలాంటి జ్వరాలు పెద్దపల్లి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ తదితర మండలాల్లో జ్వరంతో బాధపడుతున్న వారి‌ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.

జ్వరం పూర్తిగా తగ్గిన తరువాత కుడా కోలుకొవడానికి నెల రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, పాదాల భాగాన వాపులు ఇతర సమస్యలతో మంచం నుండి లేవడం కూడా కష్టంగా మారింది. అన్ని పరీక్షలు నిర్వహించినా కూడ వైరల్ ఫీవర్స్ అని తేలుతుంది. కానీ ఒళ్ళు నొప్పుల కారణంగా కోలుకోవడం కష్ట అవుతుంది. ఈ నొప్పులు తగ్గిపోవడంతో చాల మంది ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ బిల్లులు తడిసి మోపేడు అవుతున్నాయి. ఇంట్లో‌ ఒక్కరికి జ్వరం వస్తే మిగితా కుటుంబ సభ్యులకి వేగంగా వ్యాపిస్తోంది. కుటుంబాలు కుటుంబాలే జ్వరం నుండి సతమతమౌతున్నాయి.

సహజంగా వైరల్ ఫీవర్స్ వస్తే వారం రోజుల్లో తగ్గాలి. తరువాత నాలుగైదు రోజులలో కోలుకుంటారు. కానీ ఈ ప్రాంతాల్లో వచ్చే జ్వరాలు కోలుకోవడానికి రెండు నెలలకుపైగానే సమయం పడుతుంది. ఈ జ్వరాల కారణంగా ఎన్నో కుటుంబాలు అర్థికంగా చితికిపోతున్నాయి. అయితే ప్రభుత్వం మెరుగైన వైద్యంతో పాటు అర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. వైరల్ ఫీవర్స్ కారణంగా ఇలాంటి నొప్పులు వస్తాయని‌ డాక్టర్స్ చెబుతున్నారు. ఇన్ని రోజులు కోలుకోకపోవడం జ్వర ప్రభావమేనని డాక్టర్ చెబుతున్నారు.

సుల్తానాబాద్ మండలంలోని గ్రామాలలో కీళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులతో కూడిన జ్వరాలు‌ వస్తున్నాయి. జ్వరం తగ్గి 10 నుంచి 15 రోజులు అవుతున్నా కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపులు తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. ఇంట్లో కనీసం పనులు చేసుకోలేక పోతున్నామని, బయటికి వెళ్ళాలంటే ఇంకోకరి‌ సహాయం అవసరమవుతోందని తమ గోడు వెళ్లగక్కుతున్నారు. ఈ వైరల్ ఫీవర్ కారణంగా నడవడం కష్టంగా ఉందని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..