TSRTC Bus Accident: డ్రైవర్‌కు గుండెపోటు.. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా..
ఆసిఫాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో..కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరికి గాయాలవడంతో..
అప్పటివరకు బానే ఉంటున్నారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఆసిఫాబాద్‌లో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో..కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులున్నారు. వారిలో ఇద్దరికి గాయాలవడంతో.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్కు గుండె పోటు రావడంతో అతడు బస్సులోంచి కిందకు దూకేశాడు. దీంతో బస్సు పక్కనే ఉన్న గోతిలోకి బోల్తా పడింది. సోమవారం ఉదయం 6 గంటలకు ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన TS 20Z 0015 సూపర్ లగ్జరీ బస్సు ఆసిఫాబాద్ నగర శివరాలోని అయ్యప్ప గుడి సమీపంలోకి వచ్చిన తర్వాత బస్సు బోల్తా పడింది.
డ్రైవర్ సదయ్యకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో అతను ఒక్కసారిగా బస్సులోంచి కిందకు పడిపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడిన ఆర్టీసీ బస్సులో మొత్తం 7 గురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ సదయ్యకు ఛాతిలో నొప్పి రావడంతోనే బస్సులో నుంచి దూకినట్లుగా బస్సులో ప్రయాణిస్తున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్‌కు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం