చాణక్య నీతి : ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండటం కంటే వదిలివేయడమే మేలు
Samatha
17 January 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగప పడే ఎన్నో విషయాల గురించి నీతి శాస్త్రం ద్వారా తెలియజేయడం జరిగింది.
చాణక్య నీతి
అదే విధంగా, ఆయన వ్యక్తులు, బంధాలు, బంధుత్వాలు, గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి ఎలాంటి వ్యక్తులతో ఉండకూడదో కూడా తెలియజేశాడు.
బంధాలు, బంధుత్వాలు
చాణక్య నీతి ప్రకారం ప్రతి బంధం చివరి వరకు సాగుతుందని లేదు, జీవితం ప్రశాంతంగా , ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోవాలంటే, తప్పకుండా కొందరిని వదిలివేయాలంట. వారు ఎవరంటే?
వదిలి వేయడం
అభివృద్ధికి అడ్డుగా నిలిచే వ్యక్తి, ఒక వ్యక్తి మన పనులకు అడ్డు వస్తూ, నిరంతరం బాధ కలిగిస్తే, అలాంటి వ్యక్తితో జీవితం కొనసాగించడం కంటే, ఒంటరిగా ఉండటం మేలు అని చాణక్య నీతి చెబుతుంది.
అభివృద్ధికి అడ్డు పడేవారు
చెడు సహవాసం కూడా మంచిది కాదు, మనం ఎలాంటి వ్యక్తులతో ఉంటే మనకు అలాంటి లక్షణాలే వస్తాయి. అందుకే చెడు ప్రవర్తన ఉన్నవారికి దూరం ఉండటం మంచిది.
చెడు సహవాసం
అలాగే ఆ చార్య చాణక్యుడి దృష్టిలో బంధం అంటే బాధను మోయడానికి కాదు, ఒక వ్యక్తి నీ భావాలకు, నీ ఆలోచనలుకు, నీకు విలువను ఇవ్వనప్పుడు, ఆ బంధాన్ని వదిలి వేయాలి.
బాధ
కొన్ని బంధాలు చాలా హానికరమైనవి. అందుకే హాని చేసే బంధాలను వదిలివేయడమే మంచిదని చెబుతున్నాడు చాణక్యుడు. వాటికి దూరం ఉండాలంట.
హానికరమైన బంధాలు
ఒక వ్యక్తి దగ్గర భయంతో బతకాల్సి వస్తే, అలాంటి బంధానికి కూడా దూరం ఉండాలని చెబుతున్నాడు చాణక్యుడు. వాటిని వదిలేసి మంచి జీవితం కొనసాగించాలి.