Dog Mothers Love: అమ్మ ప్రేమకు సాటి ఏదీ రాదు.. తల్లిని కోల్పోయిన ఓ లేగ దూడకు పాలు ఇచ్చిన శునకం
ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు. అమ్మ ప్రేమలోని కమ్మదనం అనుభవించడానికి అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు.. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా సృష్టిలో తియ్యనైంది మాతృత్వం అనిపిస్తుంది...
Dog Mothers Love: ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ఏదీ సాటి రాదు. అమ్మ ప్రేమలోని కమ్మదనం అనుభవించడానికి అవతార పురుషుడు కూడా మానవజన్మ ఎత్తాడు అని అంటారు.. మనుషుల్లోనే కాదు పశుపక్షాదుల్లో కూడా సృష్టిలో తియ్యనైంది మాతృత్వం అనిపిస్తుంది. ఒకొక్కసారి ఈ అమ్మప్రేమ జాతి వైరాన్ని కూడా మరిపిస్తుందని అనేక సంఘటనలు చూసి తెలుసుకున్నాం. ఇక తన బిడ్డ ఆకలి తీర్చడానికి అమ్మ ఎప్పుడూ ముందుంటుంది. తాను తినడం మానేసి మరీ బిడ్డ ఆకలితీర్చేది అమ్మ.. ఇక తాజా ఓ శునకం లేగ దూడ ఆకలి తీర్చడానికి అమ్మగా మారింది. అక్కున చేర్చుకుని తన చనుపాలు పట్టింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఓ లేగ దూడ కొన్ని రోజుల క్రితం తల్లిని కోల్పోయింది. దీంతో ఈ దూడను ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జై శ్రీరాం గోశాలలో విడిచి పెట్టారు. అయితే ఈ లేగ దూడ ఏ ఆవు దగ్గరకు వెళ్లి పాలు తాగలేదు. ఇక డబ్బా పాలు పట్టినా తాగలేదు.. దీంతో గోశాల నిర్వాహకులు లేగదూడ కోసం కంగారు పడ్డారు. అయితే లేగ దూడ పాలు తాగకపోయినా హుషారుగా చెంగు చెంగున గంతులేస్తూ ఆడుకుంటుంది.. ఇది చూసిన వారు ఆశ్చర్య పోయారు.
ఆరా తీస్తే.. లేగదూడ గోశాలలో ఉన్న ఓ కుక్క పాలు తాగుతూ కనిపించింది. కొన్ని రోజుల నుంచి ఆ లేగ దూడ కుక్కలతో కలిసి తిరగడం, వాటితోనే కలిసి పడుకోవడం చేస్తోంది. శునకం కూడా ఆ తల్లి లేని లేగ దూడను అక్కున చేర్చుకొని తన పాలతో కడుపు నింపుతూ ఏంతో ప్రేమగా ఉంది. డిడి చూసిన వారు కుక్కలోని తల్లిమనసుకు ఫిదా అయ్యారు.
Also Read: