AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళా కండక్టర్లకు మెరూన్‌ కలర్‌ యూనిఫాం.. 30 వేల మీటర్ల వస్త్రం ఆర్డర్‌

Telangana RTC:  గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫాం అందనుంది. మెరూన్‌ కలర్‌లో యూనిఫామ్‌ను అందించనున్నారు....

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. మహిళా కండక్టర్లకు మెరూన్‌ కలర్‌ యూనిఫాం.. 30 వేల మీటర్ల వస్త్రం ఆర్డర్‌
Subhash Goud
|

Updated on: Feb 23, 2021 | 3:27 PM

Share

Telangana RTC:  గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫాం అందనుంది. మెరూన్‌ కలర్‌లో యూనిఫామ్‌ను అందించనున్నారు. ఈ యూనిఫాం ధరించే మహిళా కండక్టర్లు విధులు నిర్వహించనున్నారు. 2019 చివరిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫామ్‌ అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. తెలంగాణ ఆర్టీసీలో పని చేస్తున్న 4,800 మంది మహిళా కండక్టర్ల కోసం రేమండ్స్‌ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్నిసరఫరా చేస్తారు. వారు తమ కొలతలకు తగ్గట్టు కుట్టించుకుని నిత్యం ఆప్రాన్‌ ధరించి విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.

కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు..

కాగా, 2019 సంవత్సరంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాలతో కేసీఆర్‌ వివిధ అంశాలపై మాట్లాడారు. అలాగే ఈ సందర్భంగా పలు హామీలు కూడా ఇచ్చారు. అందులో మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఆప్రాన్‌ను యూనిఫాంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఆప్రాన్‌ ఏ రంగులో ఉండాలన్నది కూడా మహిళా కండక్టర్లే నిర్ణయించి చెప్పాలంటూ ఓ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం కేసీఆర్‌. ఇక కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుని నివేదిక అందించింది. ఎక్కువ మంది మెరూన్‌ కలర్‌ యూనిఫాం కావాలని కోరుకోవడంతో ఫైనల్‌గా మెరూన్‌ కలర్‌నే ఎంపిక చేసింది ఆర్టీసీ. అలాగే వస్త్రం నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రేమండ్స్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ వస్త్రాన్ని కొనేందుకు ఏడాదికిపైగా సమయం తీసుకుంది. ఆర్టీసీలో ఉన్న 4,800 మంది మహిళా కండక్టర్లకు రెండు ఆప్రాన్‌లు కుట్టించి ఇవ్వాలని, సుమారుగా 30 వేల మీటర్ల వస్త్రం అవసరం అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిర్ధారించారు.

కుట్టుకూలి ఉద్యోగులే భరించుకోవాలి:

కాగా, ఆర్టీసీకి ఆదాయం తగ్గుముఖం పట్టడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతోంది. ఆ వెంటనే బస్సు చార్జీలు పెంచడంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.2 కోట్లు పెరిగింది. దీంతో వస్త్రం కొనాలనుకున్న తరుణంలో కరోనా సమస్యగా మారింది. తర్వాత ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు వస్త్రం కొనుగోలు చేశారు. అయితే సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున వస్త్రం మాత్రమే ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కుట్టుకూలీ డబ్బులు ఉద్యోగులే భరించుకోవాల్సి వస్తోంది.

మూడేళ్లకోసారి యూనిఫాం..

అయితే ఆర్టీసీలో ప్రతి మూడు సంవత్సరాలకోసారి రెండు జతల చొప్పున ఉద్యోగులకు యూనిఫాం అందించే ఏర్పాట్లు చేస్తుంటారు. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటారు. కొంత మంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఉన్న వస్త్రం కొంత స్టోర్‌లో ఉండిపోవడంతో కొన్ని డిపోలకు మధ్య ఒకసారి యూనిఫాం సరఫరా అయింది. ఇక యూనిఫాం లేకుండా విధులకు హాజరైతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తుండటంతో సొంత డబ్బులతో యూనిఫాం కొనుగోలు చేసి కుట్టించుకుని విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడిచ్చే యూనిఫాం మహళలకు మాత్రమే ఇవ్వనుంది ఆర్టీసీ. ఇక పురుషులకు మాత్రం యూనిఫాం లేనట్లే.

Also Read:

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి