Telangana: వీడు డాక్టర్ కాదు నీచుడు.. ఇంట్లో ఇల్లాలు.. ఆసుపత్రిలో ప్రియురాలు.. చివరకు భార్యా, ఇద్దరు పిల్లలను..

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి మిస్టరీ వీడింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలపాలిట కాలయముడయ్యాడు.. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని కారణంతో భార్యకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. ముక్కు నోరు మూసి అభంశుభం తెలియని ఇద్దరు కూతుళ్ల ప్రాణం తీశాడు.. అనంతరం ఏవేవో కట్టుకథలు అల్లి తప్పించుకున్నాడు.. చివరకు ప్లాన్ బెడిసికొట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Telangana: వీడు డాక్టర్ కాదు నీచుడు.. ఇంట్లో ఇల్లాలు.. ఆసుపత్రిలో ప్రియురాలు.. చివరకు భార్యా, ఇద్దరు పిల్లలను..
Crime News
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 15, 2024 | 3:44 PM

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి మిస్టరీ వీడింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలపాలిట కాలయముడయ్యాడు.. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని కారణంతో భార్యకు విషపు ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చాడు. ముక్కు నోరు మూసి అభంశుభం తెలియని ఇద్దరు కూతుళ్ల ప్రాణం తీశాడు.. అనంతరం ఏవేవో కట్టుకథలు అల్లి తప్పించుకున్నాడు.. చివరకు ప్లాన్ బెడిసికొట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలంలో 45 రోజుల క్రితం రోడ్డు పక్కన చెట్టుకి కారు ఢీకొని ఉంది.. దానిలో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కారు నడుపుతున్న భర్త డాక్టర్ ప్రవీణ్ కు గాయాలు లేకపోవడం.. వారికి ప్రమాదం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అనుమానస్పద కేసుగా నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్కూరు మండలం రామ్ నగర్ కు చెందిన కుమారి (28) రఘునాథ పాలెం మండలం భావోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్ తో 2019 లో వివాహం జరిగింది. డాక్టర్ ప్రవీణ్ హైదారాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనస్థిషియా వైద్యుడుగా పని చేస్తున్నాడు. వీరికి కృతిక (3) కృషిక (5) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహించే ప్రవీణ్ కు అదే హాస్పిటల్ లో పని చేస్తున్న కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే యువతితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భార్య కుమారికి తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల మధ్య పంచాయితీలు నిర్వహించి నచ్చజెప్పి పంపేవారు.

అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని.. వాళ్లని అడ్డు తొలగించుకోవాలని ప్రవీణ్ కు యువతి ప్రాన్సిస్ చెప్పడంతో..ఇద్దరూ కలిసి వారి హత్యకు స్కెచ్ గీశారు. భార్య, పిల్లలను హత్య చేయడానికి మే నెలలో పది రోజులు సెలవులు పెట్టి స్వగ్రామం బావోజీ తండాకు కుటుంబంతో కలిసి వచ్చాడు. ఏ విషపు ఇంజెక్షన్ వాడితే చనిపోతారో గూగుల్‌లో వెతికి మరి హత్యకు స్కెచ్ గీశాడు. ఒకరోజు ఖమ్మం పనిమీద కుటుంబంతో వచ్చి తిరిగి కారులో స్వగ్రామానికి వెళుతున్న సమయంలో తన భార్య ఒంట్లో నలతగా ఉందని భర్తకు చెప్పింది.. దీంతో మార్గ మధ్యంలో బల్లెపల్లి సెంటర్ లో ఓ మెడికల్ షాపు వద్ద కారు ఆపి కాల్షియం ఇంజెక్షన్ తో పాటు.. మరో ఇంజక్షన్ ను కొనుగోలు చేశారు. కారులో కొంచెం దూరం వెళ్ళిన తరువాత కారు వెనుక సీటులో భార్యను పడుకోబెట్టి.. ఇంజెక్షన్ తో పాటు.. తాను వేసుకున్న ప్లాన్ ప్రకారం విషపు ఇంజెక్షన్ ఇవ్వడంతో కుమారి స్పృహ కోల్పోయి వెనుక సీటులో పడిపోయింది.. తర్వాత ఇద్దరు చిన్నారులను ఒకరి తర్వాత ఒకరిని నోరు ముక్కు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. ముగ్గురూ చనిపోయారని నిర్థారించుకున్న తర్వాత..కారును మంచుకొండ వద్ద రోడ్డు పక్కన చెట్టుకి పిల్లలు ఉన్న వైపు ఢీకొట్టించి..రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు.

తమ కుమార్తె, పిల్లల మృతి పై అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కారులో ఖాళీ సిరంజీతో పాటు.. పలు ఆధారాలు సేకరించారు. భార్య చేతిపై ఇంజెక్షన్ ఇచ్చిన మచ్చలు కనిపించాయి. వీటిని పోరెన్సిక్ కు పంపిన పోలీసులకు కీలక ఆధారం దొరికింది. అందులో విషపు డ్రగ్స్ ఉన్న ఇంజెక్షన్ ఇచ్చినట్లు.. పోరెన్సిక్ రిపోర్టులో తేలింది. నిందితుడు డాక్టర్ ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. నేరాన్ని అంగీకరించాడు. దాంతో నిందితుడు ప్రవీణ్ ఏ1 ,అతని ప్రియురాలు సోనీ ఫ్రాన్సిస్ ను ఏ 2 గా కేసు నమోదు చేశారు. 45 రోజులుగా మృతురాలి బంధువులు పోలీసులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, సిపి లను కలిసి ఈ కేసుపై పోరాటం చేశారు. చివరికి కేసును ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్