Telangana: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీచేస్తా.. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన తెలంగాణ హెల్త్‌డైరెక్టర్ శ్రీనివాస్
G Srinivas: సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. కొన్నాళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తున్నారు. జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలతోపాటు ఉచిత వైద్య సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో
ఖమ్మం, జూన్ 11: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన.. కొన్నాళ్లుగా సేవా కార్యక్రమాలూ చేస్తున్నారు. జీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలతోపాటు ఉచిత వైద్య సేవల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అన్నారు. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీలోని జనహితం కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. తాను పుట్టిన కొత్తగూడెం ప్రాంతంలో జీఎస్సార్ ట్రస్టు నెలకొల్పి విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. స్వతంత్రంగా లేదా ఇతర పార్టీల తరఫున పోటీ చేసే ఆలోచన లేదన్నారు శ్రీనివాసరావు.
ఉపాధి అవకాశాలు వెతుక్కొంటూ కొత్తగూడెం నుంచి ఎంతోమంది హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నియోజకవర్గ ప్రజలకు రాసిన బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు. కొత్తగూడెం సర్వజన ఆసుపత్రిలో రూ.2 కోట్లతో ట్రామా కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పొలిటకల్ ఎంట్రీపై గత కొంత కాలంగా వస్తున్న వార్తలపై మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం డాక్టర్‌గా పేషెంట్లకు సేవలందిస్తున్నానని.. ఇకపై ప్రజలకు నేరుగా సేవ చేయాలనుకుంటున్నాని తనలోని ఆకాంక్షను మీడియాకు తెలిపారు.
ప్రజా సేవ చేయడమే నిజమైన రాజకీయమని స్పష్టం చేసిన సంగతి తెలిపిందే. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గానికి నూతన రాజకీయాల అవసరముందని అన్నారు. ఇక్కడి నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు గత కొంత కాలంగా అంటున్నారు.
గతేడాది తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించిన సమయంలోనూ శ్రీనివాసరావు తీరు వివాదస్పదమైంది. ప్రగతిభవన్ నుంచి వర్చువల్ ద్వారా మెడికల్ కాలేజీల్లో క్లాసులను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సమయంలో సీఎం కేసీఆర్ కాళ్లకు డీహెచ్ శ్రీనివాసరావు మొక్కడం సంచలనంగా మారింది.
బీఆర్ఎస్ టికెట్ కోసమే డీహెచ్ కేసీఆర్ కాళ్లకు మొక్కారంటూ విమర్శలు గుప్పుమన్నాయి. అయితే తాను సీఎం కేసీఆర్ కాళ్లు మెుక్కటంపై శ్రీనివాసరావు వివరణ కూడా ఇచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఒక్కసారి కాదు వందసార్లైనా బరాబర్ కాళ్లు మెుక్కుతానడంతో అంతా షాక్ అయ్యారు.
మరో సందర్భంలో యేసు క్రీస్తు వల్లే కరోనా నయమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలా నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచే డీహెచ్ శ్రీనివాసరావు తాజాగా.. పొలిటకల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో ఖమ్మం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం