AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC: నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌.. కఠిన నిబంధనల నడుమ పరీక్ష.

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ప్రారంభం కానుంది. పేపర్‌ లీకేజీ వ్యవహారం తర్వాత టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కఠిన నిబంధనల నడుమ పరీక్షను...

TSPSC: నేడు తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌.. కఠిన నిబంధనల నడుమ పరీక్ష.
Tspsc Group 1 Exam
Narender Vaitla
|

Updated on: Jun 11, 2023 | 7:01 AM

Share

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష ప్రారంభం కానుంది. పేపర్‌ లీకేజీ వ్యవహారం తర్వాత టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండడంతో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కఠిన నిబంధనల నడుమ పరీక్షను నిర్వహిస్తోంది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 10.15 గంటల వరకే గ్రూప్‌-1 పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసేస్తారు.

హాల్‌టికెట్లు, ప్రభుత్వం జారీ చేసిన ఐడీ ప్రూఫ్‌ను చెక్‌ చేస్తారు. మెటల్‌ డిటెక్టర్‌తో పరిశీలించి లోపలికి పంపుతారు. అభ్యర్థులు షూ ధరిస్తే.. విప్పి లోపలికి వెళ్లాలి. బెల్టు ధరించినా.. తీయించి పరిశీలిస్తారు. ఆ తర్వాత మళ్లీ బెల్టు ధరించొచ్చు. తాళిబొట్టు మినహా ఇతర ఆభరణాలేమైనా ధరిస్తే అక్కడే తీయిస్తారు. ఇదిలా ఉంటే ఉంటే నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. గత అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. ఫలితాలనూ సైతం ప్రకటించారు. అయితే పేపర్‌ లీక్‌ నేపథ్యంతో ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేశారు.

ఈ నిబంధనలు తప్పనిసరి..

పేపర్‌ లీకేజీ నేపథ్యంలో ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. జంబ్లింగ్‌ విధానంలో ప్రశ్నలు రూపొందించారు. అభ్యర్థులు బూట్లు వేసుకుని పరీక్షకు రాకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని కమిషన్‌ స్పష్టం చేసింది. అలాగే హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా? సరిగా ముద్రణ కాకపోయినా? గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ తీసుకోవాలి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు, ఆ ధార్‌ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..