AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DGP Mahender Reddy: ‘మహిళలను వేధిస్తే.. దబిడి దిబిడే’.. నిరంతరం అందుబాటులో ఉమెన్‌ సేఫ్టీ వింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి

DGP Mahender Reddy - Cyber Lab: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఉమెన్ సేఫ్టి వింగ్ ఎంతగానో కృషి చేస్తోందని.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉమెన్ సెఫ్టీ వింగ్

DGP Mahender Reddy: ‘మహిళలను వేధిస్తే.. దబిడి దిబిడే’.. నిరంతరం అందుబాటులో ఉమెన్‌ సేఫ్టీ వింగ్: డీజీపీ మహేందర్ రెడ్డి
Dgp Mahender Reddy
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2021 | 5:55 PM

Share

DGP Mahender Reddy – Cyber Lab: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఉమెన్ సేఫ్టి వింగ్ ఎంతగానో కృషి చేస్తోందని.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉమెన్ సెఫ్టీ వింగ్ పనిచేస్తుందని.. మహిళలను వేధిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. షీ భరోసా సైబర్ ల్యాబ్, NRI సెల్, కౌన్సెలింగ్ కేంద్రం, మానవ అక్రమ రవాణా నిరోధక కేంద్రం, మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ కేంద్రాలను మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు అంజనీ కుమార్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజేపీ మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమెన్ సేఫ్టి వింగ్‌లో పనిచేస్తున్న అధికారులను అభినందించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం.. శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో ఉమెన్ సేఫ్టి వింగ్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉమెన్ సేఫ్టి వింగ్ నిరంతరం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందన్నారు.

మహిళలపై జరుగుతున్న నేరాలను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. న్యాయస్థానాలలో నేరస్తులకు శిక్షలు పడేలా చూసేందుకు సైబర్ ల్యాబ్ పనిచేస్తుందని వెల్లడించారు. నేరాలకు పూర్తిగా నిర్ములించడానికి సైబర్ ల్యాబ్ విశేష కృషిచేస్తుందని తెలిపారు. మిస్సింగ్ పర్సన్స్‌ కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. 800 పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను సైబర్ ల్యాబ్ మానిటరింగ్ చేస్తుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత చాలా ముఖ్యమని అధికారులకు సూచించారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేరం జరిగితే వెంటనే దొరికి పోతామనే భయాన్ని సీసీటీవీ కెమెరాలు రుజువుచేస్తున్నాయని తెలిపారు. గత 6 సంవత్సరాల్లో నేరస్తులకు 58 శాతం శిక్షలు పడేలా చేశామన్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కంట్రోల్ చేస్తున్నామని వెల్లడించారు.

అనంతరం ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు అంజనీ కుమార్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. ఆన్‌లైన్‌లో మహిళలను వేధిస్తే ఇకనుంచి కఠిన చర్యలు తీసుకోనున్నారు. స్పెషల్‌ ఫోర్స్‌తో నిరంతరం పర్యవేక్షించి.. మహిళలను వేధించేవారిని శిక్షించనున్నట్లు హైదరాబాద్‌ పరిధిలోని పోలీసు అధికారులు వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి సైబర్ ల్యాబ్ కృషి చేస్తోందన్నారు. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుందన్నా్రు. ఆన్ లైన్లో మహిళలను వేధిస్తే.. కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Also Read:

Manickam Tagore: హుజూరాబాద్ ఫలితాలపై ఆ తర్వాతే స్పందిస్తాం.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్..

Huzurabad By Election Result: బండి సంజయ్‎కి అమిత్ షా ఫోన్.. హుజురాబాద్ ఫలితాలపై ఆరా..

Huzurabad By Election Result: ’గెల్లు‘కు ఊహించని ఝలక్.. హ్యాండిచ్చిన స్వగ్రామం, అత్తగారి ఊరు ఓటర్లు..