AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devarakadra: ఆమె చేసిందే పట్టా.. చెప్పిన వ్యక్తే ఓనర్.. దేవరకద్ర తహశీల్దార్ పై ఆరోపణల వెల్లువ..

ఆమె పేరు జ్యోతి.. ప్రొఫెషన్‌ తహశీల్దార్‌. స్థలం ఏదైనా ఆమె చెప్పిన వ్యక్తే ఓనర్‌. ఆమె చేసిందే పట్టా. పేదలు, చనిపోయిన వ్యక్తుల భూములను చాలా ఈజీగా తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదేమనీ అడిగితే.. మీ ఇష్టం..

Devarakadra: ఆమె చేసిందే పట్టా.. చెప్పిన వ్యక్తే ఓనర్.. దేవరకద్ర తహశీల్దార్ పై ఆరోపణల వెల్లువ..
Devarakadra
Ganesh Mudavath
|

Updated on: Nov 19, 2022 | 7:53 AM

Share

ఆమె పేరు జ్యోతి.. ప్రొఫెషన్‌ తహశీల్దార్‌. స్థలం ఏదైనా ఆమె చెప్పిన వ్యక్తే ఓనర్‌. ఆమె చేసిందే పట్టా. పేదలు, చనిపోయిన వ్యక్తుల భూములను చాలా ఈజీగా తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదేమనీ అడిగితే.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ కరాకండీగా క్లారిటీ ఇచ్చేయడం గమనార్హం. మహబూబ్‌నగర్‌జిల్లా దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప భూమిని తహసీల్దార్‌ జ్యోతి మరొకరి పేరు మీద పట్టా చేశారు. ఈ మధ్యే ఎల్లప్ప, అతని భార్య చనిపోవడంతో వారసుడిగా కుమారుడు విక్రమ్‌కు సంక్రమించాల్సిన 9 గుంటల భూమిని అలవోకగా వేరే వాళ్లకు పట్టా చేసిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. విక్రమ్‌ మీసేవ కేంద్రంలో వివరాలు సేకరిస్తే, రెండు నెలల క్రితమే అతని బంధువు పేరిటే పట్టా చేసిట్లు కనిపిస్తోంది. ఇతరులకు ధారాదత్తం చేసిన తన భూమిని తనకు ఇవ్వాలని తహసీల్దార్ జ్యోతిని వేడుకున్నాడు విక్రమ్‌. ఆమె కనికరించకపోయే సరికే సాయం చేయండంటూ లోకల్ మీడియాను ప్రాధేయపడ్డాడు.

అతని ఆవేదనను అర్థం చేసుకుని.. ఆమెను ప్రశ్నిస్తే మీరేం చేసుకుంటారో చేసుకోండని, తనను ఎవరు ఏం చేయాలేరని క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ పట్టా పేరెందుకు మార్చారో మాత్రం చెప్పలేదు. కేవలం ఎల్లప్ప భూమినే కాదు.. మండలంలో చాలామంది పేదల భూములు, చనిపోయిన వ్యక్తుల స్థలాలు ఇష్టమొచ్చినట్లుగా పట్టాలు చేస్తున్నట్లు జ్యోతిపై ఆరోపణలున్నాయి. గతంలోనూ పాలమూరు రంగారెడ్డిలో పనిచేసిన ఆమెను చేతివాటం కారణంగానే అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..