Dy.CM Bhatti : భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం....ప్రభుత్వంపై భారం పెంచుతుందంటూ కీలక కామెంట్లు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ విద్యుత్ తయారీ కాస్ట్ పెంచుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం….ప్రభుత్వంపై భారం పెంచుతుందంటూ కీలక కామెంట్లు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ విద్యుత్ తయారీ కాస్ట్ పెంచుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జెన్‌కో అధికారులు వాటిని అధిగమిస్తారని ఆశిస్తున్నానన్నారు భట్టి. తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్…ప్రాజెక్టుల బాట పట్టి సమీక్షలు జరుపుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిన్న మేడిగడ్డ ప్రాజెక్టును మంత్రుల బృందం సందర్శిస్తే..ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి..నిర్మాణ పనులను పరిశీలించారు. తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను సందర్శించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. గత కేసీఆర్ ప్రభుత్వం పవర్ సెక్టార్‌ను పీకల్లోతు అప్పుల్లో ముంచేసిందన్నారు. పవర్ సెక్టార్‌లోనే 81 వేల 516 కోట్ల అప్పులు చేశారని.. డిస్కమ్‌ల ద్వారా మరో 28 వేల 848 కోట్లు అప్పుగా తీసుకున్నారన్నారు. ఇన్ని అప్పులు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం.. మాతోనే కరెంట్ అని బీఆర్‌ఎస్ నేతలు లెక్కలు చెప్పారన్నారు. రాష్ట్రాన్ని తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా ముందుచూపుతో అడుగులు వేయాలన్నారు భట్టి. పవర్ సెక్టార్‌ను పీకల్లోతు అప్పుల్లో ముంచిన గత ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదన్నారు.
మరోవైపు గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అయితే పరిపాలన చేతకాక.. ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..