AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రధానిని కలుద్దాం రండి’.. బీఆర్ఎస్‎కు మంత్రి భట్టి విక్రమార్క సవాల్..

తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రాజెక్టులపై మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ కాదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గోదావరి ఏడు మండలాల విలీనంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏడు మండలాల విలీనంపై ఎలాంటి చర్చ జరగకుండానే రాష్ట్ర విభజన బిల్లు పాసైందన్నారు. లక్షలాది ఎకరాలు నీట మునగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే అని విమర్శించారు. ఈ సందర్భంగానే సింగరేణి గనులపై కూడా స్పందించారు.

'ప్రధానిని కలుద్దాం రండి'.. బీఆర్ఎస్‎కు మంత్రి భట్టి విక్రమార్క సవాల్..
Minister Batti Vikramarka
Srikar T
|

Updated on: Jul 24, 2024 | 8:16 PM

Share

తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రాజెక్టులపై మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కట్టింది బీఆర్ఎస్ కాదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గోదావరి ఏడు మండలాల విలీనంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏడు మండలాల విలీనంపై ఎలాంటి చర్చ జరగకుండానే రాష్ట్ర విభజన బిల్లు పాసైందన్నారు. లక్షలాది ఎకరాలు నీట మునగడానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే అని విమర్శించారు. ఈ సందర్భంగానే సింగరేణి గనులపై కూడా స్పందించారు. సింగరేణి కోల్ బ్లాక్స్ వేలంపాటకు పెట్టడానికి కారణం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు. వేలంపాటలో తాను పాల్గొన్నానని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పినట్లు ఈ సందర్భంగా వివరించారు. గతంలో ప్రాజెక్టుల పేరుతో 8వేల కోట్లు ఖర్చు చేసి ఖమ్మంలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని విమర్శించారు.

గతపరిపాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే సీఎం, మంత్రివర్గం చచ్చేదాకా ధర్నా చేయండి అనడం సరైనది కాదన్నారు. మంచి వాతారణంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించారు. రాష్ట్రప్రయోజనాల కోసం కలిసి రండని కోరారు. విలువైన సూచనలు, సలహాలు ఇవ్వండని ఆహ్వానించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండటమే తమందరి లక్ష్యం కావాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి కలిసి రండన్నారు. రాష్ట్రకు రావల్సిన నిధుల వాటా కోసం అందరం కలిసి ప్రధానిని కలుద్దాం రండని పిలుపునిచ్చారు. బీజేపీపై కూడా కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకంటే ఏవేవో అంశాలను లేవనెత్తుతున్నారని చెప్పారు. పక్కరాష్ట్రం వాళ్లకు నిధుల ఇస్తే మీకేంటి బాధ అంటున్నారన్నారు. దీనిపై స్పందించిన భట్టి విక్రమార్క.. తమకు ఎలాంటి బాధ లేదన్నారు. అందరితోపాటూ తమను కూడా చూడండని కోరారు. అందరికీ సమానంగా నిధులు మంజూరు చేయమని అడుగుతున్నట్లు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..