AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: సింగరేణి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. లోక్ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణి కాలరీస్ కంపెనీ సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. లోక్ సభ సమావేశాల్లో భాగంగా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించిన అనుబంధ ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిస్తూ సింగరేణి సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తెలంగాణ ప్రజలకు, సింగరేణి ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

Kishan Reddy: సింగరేణి సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. లోక్ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jul 24, 2024 | 11:42 PM

Share

సింగరేణి కాలరీస్ కంపెనీ సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రైవేటీకరణ చేయబోదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. లోక్ సభ సమావేశాల్లో భాగంగా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో.. ఎంపీ గడ్డం వంశీ అడిగిన బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించిన అనుబంధ ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. సింగరేణి సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తెలంగాణ ప్రజలకు, సింగరేణి ఉద్యోగులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. SCCLలో కేంద్ర ప్రభుత్వ వాటా 49% కాగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో తెలంగాణ ప్రభుత్వం 51% వాటాను కలిగి ఉందని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి వివరించారు. ప్రైవేటికరణ చేయాలంటే.. వాట ఎక్కువగా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకం అవుతుందన్నారు. అయినప్పటికీ, భారత ప్రభుత్వం సింగరేణి అభివృద్ధి చేయడాన్ని కొనసాగిస్తుందని.. SCCLని ప్రైవేటీకరించే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. మోడీ ప్రభుత్వం సింగరేణిని అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందని హామీనిచ్చారు.

తెలంగాణ ఇంధన వనరులను భద్రపరచడం.. దాని అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అన్ని అడ్డంకులను పరిష్కరించడం ద్వారా SCCL పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసే దిశగా ఇటీవలి ప్రయత్నాలు నైని బొగ్గు గనుల సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలలో చూడవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. SCCL థర్మల్ పవర్ ప్లాంట్‌లో బొగ్గును క్యాప్టివ్ వినియోగం కోసం 13.08.2015న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కి సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఒడిశాలోని నైనీ బొగ్గు గని కేటాయించినట్లు తెలిపారు. ఈ గని అక్టోబర్ 2022లో స్టేజ్-II ఫారెస్ట్ క్లియరెన్స్ అందిన తర్వాత అటవీ భూమిని అప్పగించడంలో అసాధారణ జాప్యాన్ని ఎదుర్కొంటోందని.. ఇది గని కార్యాచరణను ఆలస్యం చేసిందన్నారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించి, సహకార సమాఖ్య స్ఫూర్తితో గనిని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ఒడిశా అంగీకరించింది. ఫలితంగా, 04.07.2024న SCCLకి 643 హెక్టార్ల అటవీ భూమిని అప్పగించడానికి ఆమోదం లభించింది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీకి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. SCCL త్వరలో గని నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య తెలంగాణ ఇంధన భద్రత అవసరాలను మరింత బలోపేతం చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..