MLC Kavitha: ఈడీకి కవిత లేఖ.. సుప్రీం నిర్ణయం తర్వాతే విచారణ హాజరవుతానని స్పష్టం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాలేదు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించారు కవిత. తన తరఫున న్యాయవాది సోమభరత్‌ను పంపారు.

MLC Kavitha: ఈడీకి కవిత లేఖ.. సుప్రీం నిర్ణయం తర్వాతే విచారణ హాజరవుతానని స్పష్టం
Mlc Kavitha Ed Inquiry
Follow us

|

Updated on: Mar 16, 2023 | 3:29 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుకాలేదు ఎమ్మెల్సీ కవిత. ఈడీ కార్యాలయానికి న్యాయవాదులను పంపించారు కవిత. తన తరఫున న్యాయవాది సోమభరత్‌ను పంపారు. ఈడీ కోరిన సమాచారాన్ని న్యాయవాదితో పంపారు. అనారోగ్యం కారణంగా చూపుతూ.. మరో తేదీన తాను విచారణకు హాజరువతానని చెప్పినట్లు తెలుస్తోంది.

అచయితే, మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించకూడదని, దీనిపై స్టే ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన ఇంటి వద్దే ఈడీ అధికారులు విచారించాలని కోరారు. అయితే, స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం.. కవిత పిటిషన్‌పై మార్చి 24వ తేదీన విచారించనున్నట్లు ప్రకటించింది. దాంతో ఈ అంశం ఉత్కంఠగా మారింది.

అయితే, ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను ఈడీ అంగీకరించనట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. గతంలోనూ కవితకు ఓ ఛాన్స్ ఇచ్చిన ఈడీ.. ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. గురువారం విచారణను అత్యంత కీలకంగా భావిస్తోంది ఈడీ. కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించాలని భావిస్తుంది ఈడీ. బుచ్చిబాబు, పిళ్లై, సిసోడియాతో కలిపి విచారించాలని భావిస్తోంది ఈడీ. ఇక నేటితో పిళ్లై కస్టడీ గడువు ముగియనుంది. సిసోడియా కస్టడీ రేపటితో ముగియనుంది. దాంతో ఇవాళ కవిత గైర్హాజరైతే కన్‌ఫ్రంటేషన్‌లో విచారణకు ఛాన్స్ ఉండదు. ఈ నేపథ్యంలోనే కవిత అభ్యర్థనకు ఈడీ అధికారులు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరి తరువాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇక గతంలోనూ కవిత ఓ ఛాన్స్ ఇచ్చిన ఈడీ.. ఈ నెల 11వ తేదీన ఆమెను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.05 వరకు విచారించారు. మధ్యాహ్నం 2.30 కి లంచ్ బ్రేక్ ఇచ్చిన ఈడీ.. 3 గంటలకు తిరిగి విచారణ ప్రారంభించారు. అప్పటి నుంచి రాత్రి 8.05 గంటల వరకు విచారణ సాగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..