- Telugu News Photo Gallery Praposal of high speed railway corridor between AP and Telangana: You can reach secunderabad to Vizag in 4 hours Telugu News
High-speed rail: తెలుగు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ ట్రైన్స్… హైదరాబాద్ నుంచి విశాఖకు 4 గంటల్లోనే !
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్ సిటీలను అనుసంధానం చేస్తూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు పట్టాలు ఎక్కే ఛాన్సులు ఉన్నాయి. ఈ మేరకు ప్రాథమిక కసరత్తును రైల్వే శాఖ షురూ చేసింది.
Updated on: Mar 16, 2023 | 12:10 PM

హైదరాబాద్-విజయవాడ-వైజాగ్ చాలా బిజీ రూట్. ఇప్పటికే ట్రాక్ సామర్థ్యానికి మించి ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ప్రజంట్ ఉన్న ట్రైన్లలో- సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం చేరేందుకు సగటున 12 గంటల టైమ్ పడుతోంది. దురంతో ఎక్స్‌ప్రెస్ 10.30 గంటలు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8.30 గంటల సమయంలో రీచ్ అవుతున్నాయి . హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే సుమారు నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకునే అవకాశం ఉంటుంది.

ప్రజంట్ హైదరాబాద్ నుంచి విజయవాడ, వెజాగ్ వెళ్లేందుకు వరంగల్, ఖమ్మం మీదుగా ఒక రూట్... నల్గొండ, గుంటూరు మీదుగా మరో రూట్ ఉన్నాయి. ఈ రెండూ కూడా చాలా బిజీ మార్గాలు. వరంగల్ మార్గం గరిష్ఠ సామర్థ్యం 150 కిలోమీటర్లు. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం, కర్నూలు-విజయవాడ హైస్పీడ్ కారిడార్లలో గంటకు గరిష్ఠంగా 220 కిమీ వేగంతో వెళ్లేలా కొత్త లైన్లను నిర్మించాలన్నది రైల్వేశాఖ ప్రతిపాదన.

ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్-విజయవాడ-వైజాగ్ మార్గం శంషాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి నేరుగా, వేగంగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వెళ్లేందుకు ఈ మార్గం యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడకు కొత్త హైస్పీడ్ రూట్ ఎంచుకుంటారా?... నల్గొండ, గుంటూరు మీదుగానా?... లేదంటే హైదరాబాద్-విజయవాడ వయా సూర్యాపేట 65వ నంబరు నేషనల్ హైవే మీదుగా ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.

హైదరాబాద్-విజయవాడ-వైజాగ్ చాలా బిజీ రూట్. ఇప్పటికే ట్రాక్ సామర్థ్యానికి మించి ట్రైన్స్ రన్ అవుతున్నాయి. ప్రజంట్ ఉన్న ట్రైన్లలో- సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం చేరేందుకు సగటున 12 గంటల సమయం పడుతోంది. దురంతో ఎక్స్‌ప్రెస్ 10.30 గంటలు, వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 8.30 గంటల సమయంలో గమ్యం చేరుతున్నాయి. హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే సుమారు నాలుగు గంటల్లోనే హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరుకునే అవకాశం ఉంటుంది.





























