AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: రోజుకు రూ. 3 కోట్లు.. తెలంగాణలో సైబర్‌ దొంగలు దోచేస్తున్న సొమ్ము ఇది

మరీ ముఖ్యంగా తెలంగాణలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రోజుకు ఏకంగా రూ. 3 కోట్ల డబ్బు సైబర్‌ నేరస్థుల పాలవుతున్నట్లు తేలింది. గడిచి ఐదు వారాలుగా.. అంటే 35 రోజులుగా.. ప్రతి రోజు 3 కోట్ల 30 లక్షల రూపాయల...

Cyber Crime: రోజుకు రూ. 3 కోట్లు.. తెలంగాణలో సైబర్‌ దొంగలు దోచేస్తున్న సొమ్ము ఇది
Cyber Crimes
Narender Vaitla
|

Updated on: Feb 13, 2024 | 10:48 AM

Share

సైబర్‌ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మన బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయి కదా ఇంకేం భయం ధీమాగా ఉంటే పరిస్థితులు లేవు. అలా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో డబ్బులను దోచేస్తున్నారు. పోలీసులు, మీడియా ఎన్ని రకాల ప్రచారాలు చేపడుతున్నా నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పైగా రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.

మరీ ముఖ్యంగా తెలంగాణలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరుగుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం రోజుకు ఏకంగా రూ. 3 కోట్ల డబ్బు సైబర్‌ నేరస్థుల పాలవుతున్నట్లు తేలింది. గడిచి ఐదు వారాలుగా.. అంటే 35 రోజులుగా.. ప్రతి రోజు 3 కోట్ల 30 లక్షల రూపాయల చొప్పున.. అక్షరాల 150 కోట్ల రూపాయలు దోచేశారు సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. దీంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇక రకరకాల మార్గాల్లో వల విసురుతూ డబ్బులు కాజేస్తున్నారు. వీడియో గేమ్స్‌ పేరుతో, పార్ట్ టైమ్‌ జాబ్‌ పేరుతో లింక్‌లు పంపిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. కేవలం వీడియోలకు లైక్‌ కొడితే చాలంటూ నమ్మిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఇలా డబ్బులు కోల్పోతున్న వారిలో చదువుకోలేని వారు ఉన్నారనుకుంటే పొరబడినట్లే, డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసిన వారు కూడా సైబర్‌ నేరాల బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవల కేవైసీ అప్‌డేట్‌ పేరుతో కూడా నేరాలు జరుగుతున్నాయి. ఈఏడాది ఇప్పటి వరకు తెలంగాణలో ఏకంగా సైబర్‌ నేరస్థులు ఏకంగా రూ. 150 కోట్లు కొట్టేశారు.

ఇలాంటి సైబర్‌ నేరాల బారిన పడకూడదంటే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వెనుకాముందు ఆలోచించకుండా ఎలాంటి లింక్స్‌ క్లిక్‌ చేయకూడదని చెబుతున్నారు. ప్రజలకు సరైన అవగాహన లేకపోవడతోనే ఇలాంటి సైబర్ ఫ్రాడ్స్ జరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సైబర్‌ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాల్సి అవసరం ఉందని సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాగే ఉచితంగా డబ్బులు వస్తున్నాయంటే కచ్చితంగా ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆన్‌లైన్‌లో డబ్బులు కోల్పోతే వెంటనే.. 87126 72222 నెంబర్ కు వాట్సాప్ లో ఫిర్యాదు చేయవచ్చు. www.cybercrime.go.in లో లేదా 1930కి కాల్ చేసి కూడా కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..