Olxలో మోసపోయిన యాంకర్ వర్షిణి ఫ్రెండ్.. వీడియో షేర్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..
ఓఎల్ఎక్స్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో యాంకర్ వర్షిణి..
ఓఎల్ఎక్స్ మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో యాంకర్ వర్షిణి.. తన స్నేహితులరాలు సింధు నటించారు. ఓఎల్ఎక్స్లో సైబర్ నేరస్తులు ప్రజలు ఏవిధంగా మోసం చేస్తారనే విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. దీనిని షేర్ చేస్తూ.. అపరిచితులు పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు కాస్తా అలోచించండి అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఆ వీడియోలో వర్షిణి స్నేహితురాలు సింధు తన పాత ఫోన్ను రూ.30 వేలకు అమ్మకానికి పెడుతుంది. దీంతో వెంటనే తనకు ఒక అపరిచితుడి నుంచి ఫోన్ వస్తుంది. అతడు నేను మీ ఫోన్ కోనుక్కుంటాను అండి.. ముందుగా ఒక 10 రూపాయాలు పంపిస్తాను. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కన్ఫార్మ్ చేయండి అంటూ చెప్తాడు. వెంటనే ఆ అమ్మాయి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంది. ఆ తర్వాత మొత్తం అమౌంట్ స్కాన్ చేయండి అంటూ చెప్తాడు. మళ్లీ ఆ అమ్మాయి మొత్తం అమౌంట్ స్కాన్ చేస్తుంది. దీంతో వెంటనే తన అకౌంట్లో నుంచి రూ.30 వేలు అపరిచితుడి ఖాతాలోకి వెళ్ళిపోతాయి. వెంటనే అతడిని తిరిగి ప్రశ్నించగా.. మళ్లీ స్కాన్ చేయండి తిరిగి మీ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్పగా మళ్లీ చేస్తుంది. అంతే మొత్తం అమౌంట్ వెళ్ళిపోతుంది.. దీంతో మోసాపోయామని గ్రహించి పోలీస్ స్టేషన్ వైపు పరుగు తీస్తారు. ఇటీవల ఆన్ లైన్ మోసాలు ఎక్కువవుతున్న క్రమంలో పోలీసులు.. ప్రజల్లో అవగహన తీసుకురావడానికి ఈ షార్ట్మ్ ఫిల్మ్ చిత్రికరించారు.
ట్వీట్..
అపరిచితులు పంపే #QRCode ను స్కాన్ చేసే ముందు కాస్త ఆలోచించండి. @cyberabadpolice @TelanganaCOPs @hydcitypolice @RachakondaCop @SCSC_Cyberabad @CYBTRAFFIC @EOWCyberabad pic.twitter.com/O9VwRnszKI
— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) March 30, 2021
పవన్ చుట్టూ ఏదో శక్తి ఉంది.. అందుకే ఆయన రాగానే అందరూ… విరమల్లు గురించి చెప్పిన ఇస్మార్ట్ బ్యూటీ..
ప్రియురాలి కోసం చంద్రుడినే ముక్కలు చేసాడు… అక్కడి వరకు ఎలా వెళ్లాడో తెలిస్తే షాక్ అవుతారు..