ఖాకీ వనంలో గంజాయి మొక్కలు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!

మెదక్‌ జిల్లాలో పోలీస్‌ శాఖ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రక్షించాల్సిన రక్షకభట్లే, భక్షక భటులుగా మారుతున్నారు. ఖాకw వనంలో గంజాయి మొక్కల్ల కొంతమంది పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటు పడి, ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. గతంలో అరెస్టు అయినా.. ఆ ఎస్‌ఐ తీరు ఎందుకు మారలేదు..?

ఖాకీ వనంలో గంజాయి మొక్కలు.. తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న వాస్తవాలు..!
Police Corruption
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 13, 2024 | 7:32 PM

మెదక్‌ జిల్లాలో పోలీస్‌ శాఖ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రక్షించాల్సిన రక్షకభట్లే, భక్షక భటులుగా మారుతున్నారు. ఖాకw వనంలో గంజాయి మొక్కల్ల కొంతమంది పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటు పడి, ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. గతంలో అరెస్టు అయినా.. ఆ ఎస్‌ఐ తీరు ఎందుకు మారలేదు..? ఇంతకీ జిల్లా పోలీస్‌ శాఖకు ఏమైంది..?

మెదక్ జిల్లాలో వరుస ఘటనలతో పోలీస్‌ శాఖ పేరు మసక బారుతోంది. ఒక ఘటన మరవకు ముందే, మరో సంఘటన ఆ శాఖ పరువు తీస్తోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ శాఖ పెద్దలది. జూన్ నెల 28న అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నారు పోలీసులు. ఆ ట్రాక్టర్‌ను వదిలేందుకు ముప్పై వేల రూపాయలు డిమాండ్‌ చేశాడు మెదక్‌ జిల్లా హవేళిఘనపూర్‌ ఎస్‌ఐ ఆనంద్‌ గౌడ్‌. ఇరవై వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. అయితే ట్రాక్టర్ యజమాని గంగాధర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఆ డబ్బును మధ్యవర్తి మస్తాన్‌కు ఇవ్వాలని సూచించాడు ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌. ఈ క్రమంలోనే డబ్బు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

మార్చిలోనూ సేమ్‌ సీన్‌. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ ఓ ట్రాక్టర్‌ను పట్టుకున్నారు మెదక్ రూరల్ పోలీసులు. దానిని వదిలేసేందుకు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్‌ సురేందర్‌ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఎస్‌ఐ అమర్‌ హస్తం ఉందని నిర్ధారించిన అధికారులు ఎస్‌ఐ అమర్‌తోపాటు కానిస్టేబుల్‌ బాసిత్‌ను కూడా సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని మరీ, వసూళ్లకు పాల్పడుతున్నారు అధికారులు. ఇలా వరుస ఘటనలతో పోలీసు శాఖ పేరు మసకబారుతోంది. ఇక ఇటీవలే ఏసీబీకి చిక్కిన హావేలి ఘనపూర్ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌ వ్యవహారశైలి ఆది నుండి వివాదస్పదమే. గతంలో నోట్ల రద్దు సమయంలోనూ ఏకంగా ఏ1 ముద్దాయిగా అరెస్టు అయ్యాడు..

రెండు వేల పదహారు అక్టోబర్‌లో నోట్ల మార్పిడి ముఠా ఒకటి, మనోహరాబాద్‌లో తిష్టవేసి మోసాలకు పాల్పడింది. కోటి రూపాయల వరకూ చేతులు మారాయి. ఈ వ్యవహారంలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించిన ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌ బాధితులపై లాఠీఛార్జి చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆనంద్‌గౌడ్‌ ఏ1 ముద్దాయిగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. ఆ తరువాత కామారెడ్డి జిల్లాలో పని చేసి ఎన్నికలకు ముందు తిరిగి మెదక్‌ జిల్లాకు వచ్చాడు. కానీ అతని వ్యవహార శైలి మారకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఏసీబీకే చిక్కాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..