Telangana Job Calendar: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే జాబ్ క్యాలెండర్.. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..
గ్రూప్ 1 ఫైనల్స్‌కు 1:50కి బదులుగా 1:100 పద్ధతిని అనుసరించాలని కొందరు కోరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నోటిఫికేషన్‌లో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే.. కోర్టులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపేస్తాయంటూ పేర్కొన్నారు. దీంతో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడతాయని సీఎం రేవంత్ వివరించారు.
గ్రూప్ 1 ఫైనల్స్‌కు 1:50కి బదులుగా 1:100 పద్ధతిని అనుసరించాలని కొందరు కోరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నోటిఫికేషన్‌లో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరిస్తే.. కోర్టులు వెంటనే ఆ ప్రక్రియను నిలిపేస్తాయంటూ పేర్కొన్నారు. దీంతో మళ్లీ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడతాయని సీఎం రేవంత్ వివరించారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కోరే వారిలో రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్ సెంటర్ యజమానులే ఎక్కువగా ఉన్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ఇటీవల దీనిపై దీక్ష చేసిన ముగ్గురిలో ఎవరూ పరీక్ష రాసే వారు లేరన్నారు.
త్వరలోనే అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ అన్నారు. మార్చి చివర్లో ఖాళీ వివరాలు తెప్పిస్తామని.. జూన్ 2న నోటిఫికేషన్ ఇచ్చి.. డిసెంబర్ 9 నాటికి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ విధానానికి చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. TSPSC సభ్యుల ఎంపిక విషయంలో గతంలో అవలంభించిన విధానాలను సీఎం రేవంత్ తప్పుబట్టారు. గతంలో TSPSC సభ్యుల ఎంపిక సరిగ్గా జరగలేదని.. అర్హత లేని వారికి TSPSCలో చోటు కల్పించారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..