AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Budget: రైతులకు పండగే.. తెలంగాణ పద్దులో రుణమాఫీకి పెద్ద పీట..

దేశానికి అన్నం పెట్టే రైతన్నలు బాగున్నప్పుడే అభివృద్ధి కల సాకారమవుతుందన్న తెలంగాణ ప్రభుత్వం.. రైతు అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా రైతు మాఫీ కోసం రూ.6,385 కోట్లు కేటాయించారు....

Telangana Budget: రైతులకు పండగే.. తెలంగాణ పద్దులో రుణమాఫీకి పెద్ద పీట..
Rythu Runa Mafi
Ganesh Mudavath
|

Updated on: Feb 06, 2023 | 12:13 PM

Share

దేశానికి అన్నం పెట్టే రైతన్నలు బాగున్నప్పుడే అభివృద్ధి కల సాకారమవుతుందన్న తెలంగాణ ప్రభుత్వం.. రైతు అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యంగా రైతు మాఫీ కోసం రూ.6,385 కోట్లు కేటాయించారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రుణ మాఫీ ఒకే సారి జరుగుతుందా.. లేక విడతల వారీగా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు.. తెలంగాణ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో.. కేటాయింపులు భారీగా ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి 2014 ఏప్రిల్‌ 1 నుంచి 2018 డిసెంబరు 11 వరకు పేరుకుపోయిన బకాయిలే సుమారు రూ.24,738 కోట్లు ఉన్నాయి. రెండు విడతల్లో కలిపి కేవలం రూ.763 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ప్రతి రైతుకు రూ.లక్ష వరకు రుణం మాఫీ కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.37 వేల వరకు ఉన్న బకాయిలు మాత్రమే మాఫీ అయ్యాయి. 2021-22 బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయించినా.. కేవలం రూ.409 కోట్లే విడుదల చేశారు.

ఎన్నికల ఏడాదిలో నియోజకవర్గాలకు నిధుల వరద సాగింది. స్పెషల్‌ డెవలప్‌ఫండ్‌ను ప్రభుత్వం భారీగా పెంచింది. గతేడాది రూ.2 వేల కోట్లు, ఇప్పుడు రూ.10,348 కోట్లు ఇచ్చారు. సంక్షేమానికి తెలంగాణ బడ్జెట్ లో పెద్దపీట వేశారు. గ్రామాల అభివృద్ధికి కేటాయింపులు భారీగా పెరిగాయి. పల్లె ప్రగతి, పంచాయతీరాజ్‌ శాఖకు ఏకంగా రూ.31,426 కోట్లు ఇచ్చారు. దళిత బంధుకు రూ.17,700 కోట్లు, మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు, ఓల్డ్‌ సిటీలో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు ఉన్నాయి.

సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది.. అని హరీశ్ అన్నారు. మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి వరుసగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రతులను అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ కావడంతో.. అందరిచూపు బీఆర్ఎస్ ప్రభుత్వంపైనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..