
ప్రశాంతంగా వెళ్తున్న రోడ్డుపై అకస్మాత్తుగా మొసలి కనిపిస్తే ఎలా ఉంటుంది.? ఆ గ్రామ శివారులో భారీ మొసలిని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆపై సాహసం చేసి ఆ మొసలిని వలలతో బంధించారు. దాన్ని అటవీశాఖ అధికారులకు అప్పగించి ఊరంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మహబూబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ పరిధిలోని భూక్య దసురుతండాలో జరిగింది. ఈ మార్గంలో తండావాసులు నిత్యం కాలి నడకన వెళుతుంటారు. సమీపంలో ఎక్కడా చెరువులు కూడా లేవు కానీ హఠాత్తుగా నడి రోడ్డుపై మొసలి ప్రత్యక్షమయింది.
ఇది చదవండి: చక్రం డిజాస్టర్ తర్వాత ప్రభాస్ తనతో ఎలా ఉన్నాడంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్..
తండాకు వెళ్లే రాళ్ల వాగు బ్రిడ్జిపై మొసలి సంచారాన్ని అటుగా వెళుతున్న తండా యువకులు గమనించారు. భారీ మొసలిని చూసి పరుగులు పెట్టారు. కొంతమంది యువకులు ఆ మొసలిని పట్టడానికి సాహసమే చేశారు. ఆ మొసలిని సాహసోపేతంగా చేపల వలతో బంధించి గూడూరు ఫారెస్ట్ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే ఈ ప్రాంతంలో మొసలి కనిపించడం ఇదే మొదటిసారి. తండా పరిసర ప్రాంతాల్లో ఇంకా మొసళ్ళు ఉన్నాయి కావచ్చని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఇది చదవండి: ‘నా వల్లే ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయిందన్నారు..’ మా మధ్య దూరం అందుకే.!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..