- Telugu News Telangana Cow Should Be Declared as National Animal Demands Cow protection group Yuga Tulasi Foundation in Hyderabad Telugu News
రాబోయే ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా.. గోసంరక్షణ ఉద్యమానికి తోడ్పాటు అందించాలి..
రాబోయే ఎన్నికల్లో గోవుని ప్రధాన ఎజెండాగా చేయాలని గో రక్షణ సంరక్షణలకు ప్రభుత్వాలే బాధ్య తీసుకునే విధంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు గో ఉద్యమ నాయకులు.
Updated on: Jun 02, 2023 | 9:58 PM

దేశవ్యాప్త గోసంరక్షణ ఉద్యమానికి తోడ్పాటు అందించాలని గోసంరక్షణ సంస్థ సభ్యులు విజ్ఞప్తి చేశాయి. ఖైరతాబాద్‌లో గో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

రాబోయే ఎన్నికల్లో గోవుని ప్రధాన ఎజెండాగా చేయాలని గో రక్షణ సంరక్షణలకు ప్రభుత్వాలే బాధ్య తీసుకునే విధంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు గో ఉద్యమ నాయకులు.

ఈ మేరకు శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్ లో జరిగిన గో ఆత్మీయ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా పలువురు గో ఉద్యమ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో గో ఉద్యమ రూపురేఖల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి సుదీర్ఘంగా చర్చించారు.

గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే అంశంపై కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందిగా సమావేశంలో పాల్గొన్న బీజీపీ నాయకులకు యుగ తులసి చైర్మన్ శ్రీ కె శివ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ శ్రీ టి మురళీధర్ రావు, మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ జితేందర్ జమదార్, తెలంగాణ విహెచ్ పీ గో ప్రముఖ్ శ్రీ యాదగిరి రావు తదితరులు పాల్గొన్నారు





























