Telangana Vaccination: మరీ ఇంత నిర్లక్ష్యమా?.. పిల్లల వ్యాక్సినేషన్‌పై ఆసక్తి చూపని తల్లిదండ్రులు..
Telangana Vaccination: తెలంగాణలో టీనేజర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన..
Telangana Vaccination: తెలంగాణలో టీనేజర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం నాడు దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అయితే, తొలి రోజు అంతంత మాత్రమే స్పందన వచ్చింది. రాష్ట్రంలో పిల్లల వ్యాక్సినేషన్‌పై పేర్సెంట్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలో 15 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 18,41,000 మంది ఉన్నారు. మొదటి రోజు వ్యాక్సినేషన్‌లో 24,240 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. కొన్ని జిల్లాల్లో 0 శాతం వ్యాక్సినేషన్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 7 శాతం వ్యాక్సినేషన్ జరుగగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో 4 శాతం జరిగింది. ఆదిలాబాద్, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో 3 శాతం చొప్పున వ్యాక్సినేషన్ జరిగింది. జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీమ్, మహబూబబాద్, ములుగు, నారాయణపేట, నిర్మల్ జిల్లాలో 2శాతం, మెదక్, నల్లగొండ, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 0శాతం వాక్సినేషన్ నమోదవగా.. మిగతా జిల్లాల్లో 1 శాతం చొప్పున నమోదైంది.
ఇదిలాఉంటే..15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సిన్ వేయించే బాధ్యత కాలేజీ యాజమాన్యలదే అంటూ తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. రాష్ట్రంలో 1014 కేంద్రాల్లో 15-18 ఏళ్ల యువతి, యువకులకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పిన ఆయన.. అవసరమైతే వ్యాక్సిన్ కేంద్రాలను పెంచుతామన్నారు. ప్రతీ పేరెంట్ విధిగా తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు. ఇకపోతే కోవిడ్ వ్యాక్సీన్ ఫస్ట్ డోస్ 100 శాతం పూర్తి చేసిన పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్న మంత్రి.. కేంద్రం ప్రశంసించిందన్నారు.
కాగా, జీహెచ్ఎంసీ, మరో 12 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిల్లో అర్హులైన వారు వ్యాక్సిన్ కోసం కోవిన్ (CoWin) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని తెలిపిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోచ్చని చెప్పారు. అర్హులైన వారికి కోవాగ్జిన్ డోస్‌ను మాత్రమే ఇవ్వనున్నారు. అడల్ట్స్‌కి ఇచ్చిన మోతాదు(0.5ML) లోనే యువతీయువకులకు సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 2007 సంవత్సరం లేదా అంతకు ముందు పుట్టిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులు.
Also read:
RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా.. కానీ మొత్తం రివర్స్..