RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా.. కానీ మొత్తం రివర్స్..

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న

RRR Movie: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా.. కానీ మొత్తం రివర్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2022 | 7:40 AM

మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీ కోసం పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఓమిక్రాన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లకు అనుమతి ఉండడం.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ వివాదం నడుస్తుండడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో మెగా, నందమూరి అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురుచూపులు మాత్రమే మిగిలాయి.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రాజమౌళి భారీగానే ప్లాన్ చేసినట్టుగా టాక్. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‏గా చేసేందుకు సిద్ధమయ్యారు. హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ఎక్కువగానే చేశాడు జక్కన్న. అయితే ఇందుకోసం రాజమౌళి పెట్టిన ఖర్చు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఇరవై కోట్లను ఖర్చు పెట్టారని .. మరికొందరెమో కేవలం ఐదు కోట్లు మాత్రమే అని అంటున్నారు.

కానీ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు మాత్రం ఏకంగా నలభై కోట్లు ఖర్చు పెట్టేశారని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. అయితే ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ప్రమోషన్స్ ఖర్చు పూర్తిగా వృథా అయినట్టే అంటూ టాక్. చైన్నై, బెంగళూరులలో గ్రాండ్‏గా ప్రీరిలీజ్ ఈవెంట్స్ నిర్వహించింది ఆర్ఆర్ఆర్ టీం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ముఖ్య అతిథిగా వచ్చి మరీ సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ఇప్పుడు పూర్తిగా వృథా అయినట్టే అంటూ ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‏గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..