Anupama Parameswaran: రౌడీ బాయ్స్ నుంచి బృందావనం సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్..

సంక్రాంతి రేసు నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో చిన్న సినిమాలకు రెక్కలు వచ్చాయి. పండగ కానుకా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు

Anupama Parameswaran: రౌడీ బాయ్స్ నుంచి బృందావనం సాంగ్ రిలీజ్.. స్టెప్పులతో అదరగొట్టిన అనుపమ పరమేశ్వరన్..
అశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‏గా నటిస్తోంది. ట్రైలర్ లో హీరోహీరోయిన్ మద్య కిస్ సీన్స్ ఉందంటూ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో దాదాపు 5 లిప్ కిస్ సీన్స్ ఉన్నాయని టాక్.
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2022 | 8:02 AM

సంక్రాంతి రేసు నుంచి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో చిన్న సినిమాలకు రెక్కలు వచ్చాయి. పండగ కానుకా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అటు మేకర్స్ కూడా అనుకున్న సమయంలోనే తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సంక్రాంతి సీజన్‏ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం సంక్రాంతి రేసుల ఉన్న సినిమాల్లో రౌడీ బాయ్స్ ఒకటి. ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు).

తాజాగా ఈ సినిమా నుంచి ‘బృందానం నుంచి కృష్ణుడు వ‌చ్చాడే.. య‌మునా తీరాన ఉన్న రాధ‌ను చూశాడే..’ అనే పాట‌ను రిలీజ్ చేశారు మేకర్స్.. కాలేజ్ ఫంక్ష‌న్‌లో హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్టేజ్‌పై పెర్ఫామ్ చేసేలా పాట‌ను అద్భుతంగా చిత్రీకరించారు. గోపిక‌మ్మ గెట‌ప్‌లో అనుప‌మ‌.. కృష్ణుడు క‌న్నెపిల్ల‌ల మ‌న‌సుల‌ను దోచె దొంగ అంటూ సాగే ఈ పాట ఆద్యంతం విన‌సొంపుగా ఉంది. ఈ సాంగ్‌లో హీరో ఆశిష్ కూడా క‌నిపిస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సూప‌ర్బ్ ట్యూన్‌కు సుద్దాల అశోక్ తేజ పాట‌ను రాయ‌గా.. సింగ‌ర్ మంగ్లీ శ్రావ్యంగా ఆల‌పించారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన ‘రౌడీ బాయ్స్’ సినిమాలో సాంగ్స్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘బృందావ‌నం నుంచి కృష్ణుడు వ‌చ్చాడే ..’ సాంగ్.. ఈ సినిమా నుంచి విడుదలైన పాట‌ల‌కు డిఫరెంట్‌గా ఉంది.. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అందరినీని మెప్పించేలా హిట్ చిత్రాల నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్.. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌, దేవిశ్రీప్ర‌సాద్‌, మ‌ది అండ్ టీమ్‌తో రూపొందించారు.

Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‏గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..