Singer Sunitha: వ్యవసాయమంటే ఇష్టమంటున్న సింగర్ సునీత.. అరటి తోటలో హడావిడి.. వీడియో వైరల్..
తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు సింగర్ సునీత. గాయనిగానే కాకుండా.
తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు సింగర్ సునీత. గాయనిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సునీత. తెలుగులో ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. సింగర్ సునీతకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె షేర్ చేసే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అలాగే నెట్టింట్లో తన గాత్రంతో పాటలు పాడుతూ.. లైవ్ వీడియోస్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తుంటారు సునీత. తాజాగా సోషల్ మీడియాలో సింగర్ సునీత షేర్ చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా సింగర్ ప్రకృతి ప్రేమికురాలు అన్న సంగతి తెలిసిందే. తాజాగా తనకు వ్యవసాయం చేయడమంటే ఇష్టమంటూ అరటి తోటలో.. కూరగాయల తోటలో పనిచేస్తున్న వీడియోస్ పోస్ట్ చేసింది. వీటికి జాయ్ ఆఫ్ ఫార్మింగ్… నాకు సంగీతం ఇష్టం. నా కుటుంబం, స్నేహితులను నేను ప్రేమిస్తున్నాను. నేను నన్ను ఇష్టపడేవారిని ప్రేమిస్తున్నాను. నాకు వ్యవసాయం, తోటపని అంటే చాలా ఇష్టం.. అంటూ క్యాప్షన్స్ ఇచ్చింది. ప్రస్తుతం సునీత షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని సెకండ్ మ్యారేజ్ చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు సునీత. వివాహం అనంతరం కూడా సునీత తన కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..