Suman: సినీ పరిశ్రమలో పెద్దరికం అవసరం లేదు.. హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం సీని పరిశ్రమలో పెద్దరికం గురించి చర్చలు నడుస్తున్నాయి. చిత్రపరిశ్రమకు పెద్దగా తాను ఉండనని.. గొడవలు పెట్టుకునేవారికి
ప్రస్తుతం సీని పరిశ్రమలో పెద్దరికం గురించి చర్చలు నడుస్తున్నాయి. చిత్రపరిశ్రమకు పెద్దగా తాను ఉండనని.. గొడవలు పెట్టుకునేవారికి పంచాయితీ తాను చెప్పనని.. కార్మికులకు సాయం చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలసిందే. మెగాస్టార్ కామెంట్స్ అనంతరం మెహన్ బాబు రాసిన బహిరంగ లేఖ అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమా ఇండస్ట్రీ పెద్దరికం గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరో సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో పెద్దరికం అవసరం లేదని..కరోనా లాక్ డౌన్ అనంతరం ఈ సమస్యలు తలెత్తాయని.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారన్నారు హీరో సుమన్.
సోమవారం తిరుపతిలో సుమన్ మీడియా సమావేశం నిర్వహించారు. తాను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్ళు కావస్తోందని.. దాదాపు 10 భాషల్లో 600 సినిమాల్లో నటించానని తెలిపారు. తనకు ఎలాంటి సపోర్ట్ అందలేదని.. స్వయంకృషితో మాత్రమే ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు. సుమన్ మాట్లాడుతూ.. “సినిమా టిక్కెట్ల సమస్యను అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలి. సినిమా రంగంలో ఐక్యత లేదనడం వాస్తవం కాదు. కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ లాంటి సీనియర్లు ఉన్నారు. వారి సలహా తీసుకోవాలి. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు. రాజకీయాలు ఇప్పుడు నేను మాట్లాడనని అన్నారు హీరో సుమన్.
సినిమా పరిశ్రమ ఇప్పుడున్న సమస్యలకు వర్రీ కావాల్సిన పనిలేదన్నారు హీరో సుమన్. కరోనా తర్వాతనే సినిమా పరిశ్రమలో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఇలాంటి సమయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా పరిశ్రమ ఊపందుకుంటోందన్న ఆయన.. ఏపీ, తెలంగాణలో వేరు వేరు ప్రభుత్వాలు ఉన్నాయని, అన్ని ప్రభుత్వాలు ఒకేలా ఉండాలని లేదన్నారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమస్య ఉంది. సినిమా పరిశ్రమలో ఇలాగే ఉండాలని, ఉంటుందని ఎవరూ చెప్పలేరన్నారు సుమన్. ఏపీ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయడం లేదన్నది నా అభిప్రాయం అన్న సుమన్…సీఎం బిజీ గా ఉంటే ఒకటికి రెండు సార్లు కలిసి సమస్యలు చెప్పి పరిష్కరించుకోవాలన్నారు.
Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా.. అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..
Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..
Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..