Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 50కిపైగా యాక్టివ్‌ కేసులు.. అప్రమత్తమైన తెలంగాణ వైద్య శాఖ

ఇప్పటికే కరోనా పై అప్రమత్తం గా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శాఖ అలెర్ట్ చేస్తూ లెటర్ లు రాసింది. ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయింది. గడిచిన వారం రోజుల్లో కరోనా అంశం పై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. అవసరమైన చర్యలు తీసుకోవాలని.. మెడిసిన్, మాస్క్ లు,టెస్ట్ ల విషంగా జాగ్రతగా వర్క్ అవుట్ చేయాలని సూచన చేశారు.

Telangana: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. 50కిపైగా యాక్టివ్‌ కేసులు.. అప్రమత్తమైన తెలంగాణ వైద్య శాఖ
Corona Virus
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Surya Kala

Updated on: Dec 25, 2023 | 12:45 PM

మళ్ళీ కరోనా తన పని మొదలెట్టింది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం తప్పదని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణ లో కొత్త వేరియంట్ కనిపించక పోయినా రోజురోజుకు కరోనా కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50కిపైగా యాక్టివ్‌ కేసులు తెలంగాణ లో ఉన్నాయి. అయితే అనుమానితుల సంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపించారు అధికారులు.

ఇప్పటికే కరోనా పై అప్రమత్తం గా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శాఖ అలెర్ట్ చేస్తూ లెటర్ లు రాసింది. ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయింది. గడిచిన వారం రోజుల్లో కరోనా అంశం పై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. అవసరమైన చర్యలు తీసుకోవాలని.. మెడిసిన్, మాస్క్ లు,టెస్ట్ ల విషంగా జాగ్రతగా వర్క్ అవుట్ చేయాలని సూచన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టెస్ట్ ల సంఖ్య పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. RTPCR టెస్టుల సంఖ్య పెంచాలని సూచనా చేసిన ఆరోగ్య శాఖ .. రాష్ట్ర వ్యాప్తంగా 118 ప్రభుత్వ, ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో టెస్టులు చేసేందుకు అవకాశం ఉందని వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించి టెస్టుల నీ పెంచాలని ఆదేశాలు ఇచ్చారు.

గత రెండు వారాలుగా 6,344 శాంపిల్స్‌ సేకరణ చేయగా 50 కి పైగా ఆక్టివ్ కేసులు ఉన్నాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇటీవలే జరిగిన కరోనా పై రివ్యూ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి. ప్రతి రోజూ సాయంత్రం 4గంటల వరకు కరోనా బులెటిన్ విడుదల చేయాలని ఆదేశాలని ఇచ్చారు. అనుమానిత వ్యక్తి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కి పంపించాలని నిర్ణయం తీసుకుంది హెల్త్ డిపార్ట్మెంట్. ఇప్పటి వరకు 40 శంపిల్స్ నీ జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించారు అధికారులు. అయితే ఒక్క కేసు కూడా కరాన కొత్త వేరియంట్ గుర్తించ లేదని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..