Hyderabad: న్యూ ఇయర్ ఈవెంట్లపై పోలీసుల ఆంక్షలు.. అనుమతి లేకుండా నిర్వహిస్తే కఠిన చర్యలు
ఈవెంట్లు నిర్వహించే సన్‌బర్న్, బుక్‌మైషో వంటి సంస్థలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ సీపీ మహంతి సూచించారు. సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు చెప్పారు.అనుమతి లేకుండా టిక్కెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవు సీపీ మహంతి అన్నారు. న్యూ ఇయర్ వేడుకలకోసం నిర్వహించే ఈవెంట్లపై ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి..

ఇక 2023 సంవత్సరం ముగియనుంది. మరో ఐదు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. చాలా మంది ఇప్పటి నుంచి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధిస్తున్నారు. ఈవెంట్లు నిర్వహించే సన్‌బర్న్, బుక్‌మైషో వంటి సంస్థలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ సీపీ మహంతి సూచించారు. సన్‌బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించినట్లు చెప్పారు.అనుమతి లేకుండా టిక్కెట్లు విక్రయిస్తే చర్యలు తప్పవు సీపీ మహంతి అన్నారు.
ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ వేడుకలకోసం నిర్వహించే ఈవెంట్లపై ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు , ఎస్పీల సమావేశంలో చర్చించారు. ఈవెంట్ల నిర్వహనపై సీఎం సీరియస్ అయ్యారు. ఈవెంట్ల నిర్వహణ, అనుమతులపై పోలీసు అధికారులకు డైరెక్షన్ ఇచ్చారు సీఎం.
మరోవైపు ఈవెంట్‌కు సైబరాబాద్ పోలీసులు అనుమతి లేకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించినట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి