Projects Work: ప్రభుత్వ ఖజానాపై రూ. 4.40 లక్షల కోట్ల అదనపు భారం.. కారణం ఏంటంటే..!

మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, నవంబర్ నెలలో దేశంలో 421 ప్రాజెక్టుల వ్యయం పెరిగింది. ఇందుకోసం ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.4.40 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడితో దేశంలో కొనసాగుతున్న 1,831 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. వీటిలో 421 ప్రాజెక్టుల వ్యయం పెరిగితే 845 ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి..

Projects Work: ప్రభుత్వ ఖజానాపై రూ. 4.40 లక్షల కోట్ల అదనపు భారం.. కారణం ఏంటంటే..!
Govt Projects
Follow us

|

Updated on: Dec 25, 2023 | 8:59 AM

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వం ఈ డబ్బును వివిధ వనరుల నుండి సేకరిస్తుంది. ఇందులో ప్రజల కష్టార్జిత డబ్బు నుంచి వసూలు చేసిన పన్ను కూడా ఉంటుంది. కానీ ప్రభుత్వం ప్రజల నుంచి పన్ను రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ లాభాలు ఆర్జించినా ఇప్పుడు ప్రభుత్వంపైనే లక్షల కోట్ల రూపాయల భారం పడుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాప్యం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.4.40 లక్షల కోట్లు అదనంగా భారం పడుతుంది. ప్రాజెక్టుల వ్యయం పెరగడం వల్ల ఈ అదనపు డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో రూ.150 కోట్లకు పైగా వ్యయంతో కూడిన 845 ప్రాజెక్టుల పనులు ఆలస్యంగా నడవడం వాటి వ్యయం పెరగడానికి ప్రధాన కారణం.

మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, నవంబర్ నెలలో దేశంలో 421 ప్రాజెక్టుల వ్యయం పెరిగింది. ఇందుకోసం ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.4.40 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 150 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడితో దేశంలో కొనసాగుతున్న 1,831 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. వీటిలో 421 ప్రాజెక్టుల వ్యయం పెరిగితే 845 ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి.

మంత్రిత్వ శాఖ కొత్త నివేదిక ప్రకారం, పర్యవేక్షణలో ఉన్న 1,831 ప్రాజెక్టుల అసలు బడ్జెట్ రూ. 25,10,577.59 కోట్లు. కానీ ఇప్పుడు వాటి పూర్తి అంచనా వ్యయం రూ.29,50,997.33 కోట్లు. ఈ విధంగా మొత్తం వ్యయం రూ.4,40,419.74 కోట్లు అంటే 17.54% పెరిగింది. నివేదిక ప్రకారం, నవంబర్ 2023 వరకు ఈ ప్రాజెక్టులపై రూ.15,58,038.07 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయంలో ఇది 52.80%.

చాలా ప్రాజెక్టులు 5 సంవత్సరాలకు పైగా ఆలస్యం:

845 ఆలస్యమైన ప్రాజెక్టులలో 204 దాదాపు 1 నుండి 12 నెలల వరకు ఆలస్యం అవుతున్నాయి. 198 ప్రాజెక్టులు 13-24 నెలల ఆలస్యంతో నడుస్తున్నాయి. 322 ప్రాజెక్టులు 25-60 నెలలు, 121 ప్రాజెక్టులు 5 సంవత్సరాలకు పైగా ఆలస్యం అవుతున్నాయి. 845 ఆలస్యమైన ప్రాజెక్టుల సగటు సమయం 36.64 నెలలు పెరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles